12 ఏళ్లు కష్టపడి పాలపుంత ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్..

12 ఏళ్లు కష్టపడి పాలపుంత ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్..

Photographer Takes 12 Years To Create Milkyway Pic

photographer takes 12 years to create milkyway pic : ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ జేపీ మెత్సవైనియో అరుదైన, అద్భుతమైన ఫోటో తీశాడు. ఈ ఫోటో తీయటానికి మెత్సవైనియో ఏకంగా దాదాపు 12 సంవత్సరాలు అంటే 1,250 గంటలు పాటు కష్టపడి..ఎట్టకేలకు పాలపుంత గెలాక్సీకి సంబంధించిన మొత్తం ఫోటోను తీశాడు. ఈ ఫోటో దాదాపు లక్ష పిక్సెల్స్ వ్యాసంతో హై రిజల్యూషన్ గిగా పిక్సెల్ క్లాస్ మొసాయిక్(చిన్ని చిన్న ముక్కలను కలిపిన) ఫోటోను సిద్ధం చేశాడు. దీనికోసం దాదాపు 234 మొసాయిక్ ప్యానెల్స్‌ను ఒకటిగా చేశాడు. ఈ ఫోటోలో దాదాపు మొత్తం పాలపుంతతో పాటు 20 మిలియన్ నక్షత్రాలు స్పష్టంగా కనిపించటం మరో అద్భుతమనే చెప్పాలి.

లక్ష కాంతి సంవత్సరాల విస్తీర్ణం, 100 నుంచి 400 బిలియన్‌ నక్షత్రాల సమూహం, ఆ నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, గ్రహశకలాలూ, దుమ్ము, ధూళి.. వీటన్నింటి కలయికే మన పాలపుంత. అదే నక్షత్ర మండలం. కొన్ని కాంతి సంవత్సరాల దూరం నుంచి మిలుక్కు మిలుకుమనే మెరిసే నక్షత్రాలను చూస్తే మనకు ఎంతో ఆనందంక కలుగుతుంది. ఆ నక్షత్రాలను ఒకటీ రెండూ మూడు అంటూ లెక్క పెట్టిన బాల్యం గుర్తుకొస్తుంది. అద్భుతమైన నక్షత్రాల గురించి ఎన్నో కథలు కూడా వినిఉంటాం. అటువంటి నక్షత్ర మండలం ఓ ఫోటోనే కనిపిస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో కదూ..

అలాంటి నక్షత్ర మండలాన్ని ఫోటో తీయాలని ఓ ఫోటోగ్రాఫర్ నిర్ణయించుకున్నాడు ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ జేపీ మెత్సవైనియో. ఆ ఫోటో కోసం ఏకంగా 12 ఏళ్ల పాటు కష్టపడి మన పాలపుంతను అనేక ఫోటోలు తీసాడు..అలా తీసిన వాటన్నింటినీ జత చేసి చివరకు మొత్తం గెలాక్సీ ఫోటోను సిద్ధం చేశాడు. ఫిన్‌ల్యాండ్‌కు జేపీ మెత్సవైనియో సాధించిన ఈ ఘనత సామాన్యమైనది కాదు. ఈ ఫోటో కోసం జేపీ మెత్సవైనియో 2009 నుంచి ఈ ఫోటో కోసం మెత్సవైనియో కష్టపడుతున్నాడు. అలా తాను అనుకున్నది సాధించాడు. 12 ఏళ్ల కష్టాని ప్రతిఫలం ఈ అరుదైన..అద్భుతమైన ఫోటో..