ఏలియన్లు భూమి మీదకు 2017లోనే వచ్చాయ్.. ఇదే సాక్ష్యం!!

ఏలియన్లు భూమి మీదకు 2017లోనే వచ్చాయ్.. ఇదే సాక్ష్యం!!

first-evidence-of-alien

Aliens: ఏలియన్లు భూమి మీదకు వచ్చి సంచరించాయని ఇదే తొలి సాక్ష్యం అని అంటున్నాడు హర్వార్డ్ ప్రొఫెసర్. సిగార్ షేప్‌లో ఉన్న ఆస్టరాయిడ్ 2017లో దొరికిందని అది నిజానికి వేవార్డ్ ఏలియన్ టెక్నాలజీయేనని చెప్పుకొచ్చాడు. ఆయన రాసిన కొత్త పుస్తకంలో ప్రొఫెసర్ ఏవీ లోయబ్ ముందుగా ఆ ఆస్టరాయిడ్ సోలార్ సిస్టమ్ నుంచి వచ్చిందని చెప్పాడు.

ఇప్పుడు అదే ఏలియన్ సంచారం నక్షత్రాల మధ్య జరిగిందనడానికి సాక్ష్యం అంటున్నాడు. ఆస్టరాయిడ్ 100 నుంచి 1000 మీటర్ల మధ్యలో వింతరీతిలో కదులుతుండటాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. అంతేకాకుండా అది మన పక్క గెలాక్సీ నుంచి వచ్చినట్లుగా భావించారు.

జులై 2019లో అది స్వచ్ఛమైన కేంద్ర బిందువు నుంచి వచ్చినట్లు కన్ఫామ్ అయింది. సోలార్ సిస్టమ్‌లోని వేగా డైరక్షన్ నుంచి 25కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించి భూమికి చేరినట్లు అంచనా. 2017 సెప్టెంబర్ 6న అది మన సోలార్ సిస్టమ్ ఆర్టిటల్ తలాన్ని దాటి సూర్యుడి తలానికి చేరువగా సెప్టెంబర్ 9న వెళ్లింది.

ప్రొఫెసర్ లోయెబ్ మాట్లాడుతూ.. స్పేస్ లో ఆస్టరాయిడ్ లు ఉన్నాయని చెప్పడానికి మనుషులు మాత్రమే సాక్ష్యం. మనం సహజంగానే అదెంటబ్బా అని ఆలోచిస్తుంటాం. అది ఏలియన్ సంతతికి చెందిన కాంతి పడవ అయి ఉండొచ్చు కూడా ఆయన అందులో రాసుకొచ్చారు.