Rare Treatment : 23 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన చేతులు.. కుటుంబ సభ్యులను కౌగిలించుకోబోతున్న వ్యక్తి

ప్రపంచంలోనే మొదటిసారి చేతుల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ప్రాన్స్ లో జరిగిన ఈ సర్జరీతో ఓ వ్యక్తికి విజయవంతంగా రెండు చేతులు అమర్చారు. వివరాల్లోకి వెళితే స్లాండ్‌లోని క్పావోగుర్ పట్టణానికి చెందిన ఫెలిక్స్ గ్రెటార్సన్ (49) అనే వ్యక్తికి 1998లో కరెంట్ షాక్ తగిలింది.. ఈ సమయంలో ఆయన శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో రెండు చేతులను తీసేయాల్సి వచ్చింది. ఇక అతడికి ఈ ఏడాది జనవరి నెలలో సర్జరీ చేసి రెండు చేతులు అమర్చారు.

Rare Treatment : 23 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన చేతులు.. కుటుంబ సభ్యులను కౌగిలించుకోబోతున్న వ్యక్తి

Rare Treatment

Rare Treatment : ప్రపంచంలోనే మొదటిసారి చేతుల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు. ప్రాన్స్ లో జరిగిన ఈ సర్జరీతో ఓ వ్యక్తికి విజయవంతంగా రెండు చేతులు అమర్చారు. వివరాల్లోకి వెళితే స్లాండ్‌లోని క్పావోగుర్ పట్టణానికి చెందిన ఫెలిక్స్ గ్రెటార్సన్ (49) అనే వ్యక్తికి 1998లో కరెంట్ షాక్ తగిలింది.. ఈ సమయంలో ఆయన శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. మూడు నెలలపాటు కోమాలో ఉన్నారు.

ఫెలిక్స్ ను బ్రతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు, 54 సర్జరీలు చేశారు. అదే సమయంలో ఆయన రెండు చేతులు తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. చేతుల వలన ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గుర్తించి రెండు చేతులు తొలగించారు. ఫెలిక్స్ మూడు నెలల తర్వాత కోమాలోంచి బయటకు వచ్చాడు. ఆ గాయాల నుంచి కోలుకోడానికి ఆయనకు మూడేళ్లు పట్టింది.

కాగా 2007లో టీవీ చూస్తుండగా ఓ ప్రకటన ఫెలిక్స్ కంటపడింది. ఐస్లాండ్ విశ్వవిద్యాలయంలో ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ జీన్-మిచెల్ డుబెర్నార్డ్ 1998 విజయవంతంగా చేతి మార్పిడి శస్త్రచికిత్స చేసినట్లు ఆ ప్రకటనలో చూశాడు ఫెలిక్స్.. వెంటనే వెళ్లి ఆ వైద్యుడి కలిశారు. అయితే ఆయన ఫెలిక్స్ తో మాట్లాడి, సర్జరీ వివరాలు త్వరలో చెబుతానని, ఇందుకోసం ఫ్రాన్స్ వెళ్లాలని తెలిపాడు. నాలుగేళ్ళ తర్వాత ఆ శస్త్రచికిత్స చేసేందుకు ఒప్పుకున్నారు డాక్టర్ జీన్-మిచెల్ డుబెర్నా.

వైద్యుడి నుంచి సానుకూల స్పందన రావడంతో అపరేషన్ కు అయ్యే ఖర్చుల కోసం ఫండ్ రైసింగ్ స్టార్ట్ చేశారు ఫెలిక్స్. ఫౌండ్ రైసింగ్ ద్వారా శస్త్రచికిత్సకు ఆవరసమయ్యే డబ్బును పోగుచేసుకున్నారు. దీంతో ఈ ఏడాది జనవరి 12న వైద్యులు శస్త్రచికిత్స చేశారు. 15 గంటలపాటు శ్రమించి అతడికి రెండు చేతులు అమర్చారు. చేతులు అమర్చిన తర్వాత కూడా వందల గంటలపాటు మైనర్ సర్జరీలు చేశారు. తన చేతులు కదిలేలా చేశారు. కాగా 23 ఏళ్ల తర్వాత ఫెలిక్స్ తన ఇంట్లోవారిని కౌగిలించుకునేందుకు సిద్దమవుతున్నాడు. తన భార్య, పిల్లలు మనవలు మానవరాళ్లతో సాధారణ వ్యక్తిలా గడపనున్నారు.

ఇక తనకు జరిగిన సర్జరీలపై ఫెలిక్స్ మాట్లాడుతూ…చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. సర్జరీ పూర్తైన తర్వాత విపరితమైన నొప్పి కలిగిందని.. రెండు ట్రక్కులు తన చేతులపైకి ఎక్కినట్లు ఉండేదని వివరించారు. తనకు చాలా సంతోషంగా ఉందని, 23 ఏళ్ల తర్వాత తన చేతులు తిరిగి వచ్చాయని తెలిపారు.

మోచేతులో నీటిలో కదిలించగలుగుతున్నానని ఊహించని విధంగా చేతులు కదులుతున్నట్లు తెలిపాడు. కాగా చికిత్స పూర్తైన తర్వాత రెండు నెలల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. ఆ తర్వాత తన ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ సర్జరీపై వైద్యులు మాట్లాడుతూ.. సర్జరీ విజయవంతమైందని..ఈ సర్జరీ కోసం తమ బృదం చాలా శ్రమించిందని తెలిపారు. సర్జరీ తర్వాత అతడు అనారోగ్య సమస్యలకు గురయ్యాడని ఆ సమయంలో తమకు కొంచం భయం వేసిందని, ఆ తర్వాత అతడు కోలుకున్నారని తెలిపారు.