House And Ex Husband For Sale: పాత ఇంటితో పాటు మాజీ భర్తను కూడా అమ్మకానికి పెట్టిన మహిళ..

పాత ఇంటితో పాటు మాజీ భర్తను అమ్మకానికి పెట్టిందో మహిళ.. ధర ఎంతంటే..

House And Ex Husband For Sale: పాత ఇంటితో పాటు మాజీ భర్తను కూడా అమ్మకానికి పెట్టిన మహిళ..

Hounse And Ex Husband For Sale

Updated On : April 30, 2022 / 4:21 PM IST

House And Ex Husband For Sale: ఇల్లు మారుతున్నప్పుడు..కొత్త ఇంటికి వెళతున్నప్పుడు పాత వస్తువుల్ని ఎవరికైనా ఇచ్చేస్తుంటాం. లేదా అమ్మేస్తుంటాం.అలా ఓ మహిళ తన పాత ఇంటిని అమ్మకానికి పెట్టింది. ఏంటీ దీంట్లో వింతేముంది? అనుకోవచ్చు. కానీ సదరు మహిళ తన పాత ఇంటితో పాటు ఇంటిలో కొంత ఫర్నీచర్ తో పాటు తన మాజీ భర్తను కూడా అమ్మకానికి పెట్టింది…! ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ ఇంటిని ఇంట్లో ఉన్న కొంత ఫర్నీచర్ తో పాటు మాజీ భర్తను కూడా అమ్మకానికి పెట్టింది. మాజీ భర్తతో పాటు ఆ ఇంటిని రూ.5.30 కోట్లు అని ప్రకటించింది.

పనామా సిటీ బీచ్ ఏరియాలో ఉన్న తన ఇంటిని క్రిస్టల్ బాల్ అనే 43 ఏళ్ల మహిళ రూ.5.30 కోట్లకు అమ్మకానికి పెట్టింది. ఆ ఇంటిలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో వివరించింది. స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్, త్రీ బెడ్రూమ్స్, ఇతర సౌకర్యాలతో పాటు 54 ఏళ్ల తన మాజీ భర్త రిచర్డ్‌ చైలౌ కూడా ఉంటాడని క్రిస్టల్ ప్రకనటలో పేర్కొంది. క్రిస్టల్ బాల్, రిచర్డ్ కు వివాహం జరిగిన ఏడేళ్లకు విడాకులు తీసుకున్నారు.

రిచర్డ్, క్రిస్టల్ గత ఏడేళ్లుగా అదే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. తాజాగా ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అలా వివాహం జరిగిన ఏడేళ్లకు విడాకులు తీసుకున్నారు. పిల్లల సంరక్షణ బాధ్యతను, బిజినెస్‌ను సమానంగా చుకున్నారు. ఈ క్రమంలో క్రిస్టల్ కు ఆ ఇంటిలో ఉండాలని అనిపించలేదు.దీంతో అమ్మకానికి పెట్టింది. ఇంటిని ఇంట్లో ఉన్న తన మాజీ భర్త ఫొటోలను కూడా క్రిస్టల్ ఆన్‌లైన్ సైట్‌లో పెట్టింది. అంతే కాదు తన మాజీ భర్తకు సంబంధించిన విశేషాలను కూడా ఆన్ లైన్ లో వివరించింది. తన మాజీ భర్త అద్భుతంగా వంట చేస్తాడని..అతనికి వినికిడి శక్తి చాలా ఎక్కువ అని..అతని ఇటాలియన్ ముక్కు వాసనను బాగా గుర్తించగలదని..అతను హాట్ టబ్‌ను చాలా సులభంగా ఎత్తేస్తాడని క్రిస్టల్ అమ్మకాల ప్రకటనలో వివరించింది.