Four-Day Work Week: వారానికి నాలుగు రోజులే పని.. షార్జాలో సత్ఫలితాన్నిచ్చిందా? అధ్యయనంలో ఏం తేలిందంటే

కొన్ని దేశాలు వారానికి నాలుగు రోజుల పని విధానాల్నే అమలు చేస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), స్పెయిన్, స్కాట్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని విధానమే అమలవుతోంది. ఈ దేశాల్లోని అనేక కంపెనీలు ఈ విధానాన్ని చాలా కాలం నుంచి అమలు చేస్తున్నాయి.

Four-Day Work Week: వారానికి నాలుగు రోజులే పని.. షార్జాలో సత్ఫలితాన్నిచ్చిందా? అధ్యయనంలో ఏం తేలిందంటే

Four-Day Work Week: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వారానికి ఆరు రోజుల పని విధానం అమలవుతుంటే, ఇంకొన్ని దేశాల్లో ఐదు రోజుల పని విధానం అమలవుతోంది. కొన్ని దేశాలు మాత్రం వారానికి నాలుగు రోజుల పని విధానాల్నే అమలు చేస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), స్పెయిన్, స్కాట్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని విధానమే అమలవుతోంది.

Budget 2023: క్రీడారంగానికి పెద్దపీట వేసిన బడ్జెట్.. గతంకంటే ఎక్కువ కేటాయింపులు

ఈ దేశాల్లోని అనేక కంపెనీలు ఈ విధానాన్ని చాలా కాలం నుంచి అమలు చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలు కూడా దీనికి మద్దతునిస్తున్నాయి. అయితే, వారానికి నాలుగు రోజులే పని చేయడం వల్ల నిజంగానే మంచి ఫలితాలుంటాయా? ఉత్పాదకత తగ్గిందా? పెరిగిందా? ఈ విషయంలో యూఏఈ (షార్జా) ప్రభుత్వం ఒక అధ్యయనం జరిపింది. దీనిలో సంచలన నిజాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ అధ్యయనం ప్రకారం.. వారానికి నాలుగు రోజులే పని చేయడం వల్ల ఉత్పాదకత పెరిగింది. ఉద్యోగుల సంతృప్తస్థాయి, మానసిక ఆరోగ్యం వంటివి కూడా మెరుగుపడ్డాయి. వృత్తి పరమైన సంతృప్తి, ఉత్పాదకత 90 శాతం పెరిగాయి. ఉద్యోగుల్లో సంతోష స్థాయి కూడా 91 శాతానికి చేరుకుంది.

Telangana: తెలంగాణలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ప్రారంభం.. గంభీరావుపేటలో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సాధారణంగా ఎక్కువ రోజులు పని చేసే వాళ్లకు వర్క్ లైఫ్-పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు. కానీ, నాలుగు రోజుల పని విధానం వల్ల 84 శాతం మంది ఉద్యోగులు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. వారాంతాపు సెలవుల్ని ఆస్వాదించే వారి శాతం కూడా 95 శాతం పెరిగింది. ఈ విధానం వల్ల ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే అవకాశం దొరికింది. వాళ్లు ఖాళీ సమయంలో తమకు నచ్చిన పనులు చేసుకోగలుగుతున్నారు. హాబీస్ నెరవేర్చుకుంటూ, చదువుకుంటూ, ఇతర ప్రైవేట్ జాబ్స్ చేసుకునే టైమ్ కూడా దొరుకుతోంది.

ప్రభుత్వ సంస్థల్లో 88 శాతం ఉత్పాదకత పెరిగింది. ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ కూడా 81 శాతం పెరిగింది. ఉద్యోగుల హాజరు శాతం కూడా మెరుగుపడింది. సిక్ లీవ్ రేట్ 45 శాతం తగ్గింది. ప్రస్తుతం అనేక దేశాలు నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేయడంపై ఆలోచిస్తున్నాయి.