Free Condoms : కండోమ్స్ ఉచితం.. దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం, కారణం ఇదే..

ఆ దేశ ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా కండోమ్ లు ఇవ్వనుంది. ఛీఛీ.. మరీ..చీప్ గా కండోమ్స్ ఇవ్వడం ఏంటి? అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ, దీని వెనుక కారణం తెలిస్తే ఆ దేశ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేము.

Free Condoms : కండోమ్స్ ఉచితం.. దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం, కారణం ఇదే..

Free Condoms : ఎక్కడైనా ప్రభుత్వాలు తమ ప్రజలకు నిత్యవసరాలు అయిన బియ్యం, పప్పు దినుసులు ఉచితంగా ఇస్తాయి. కొన్ని ప్రభుత్వాలు తమ ప్రజలకు తాగునీటిని ఫ్రీగా ఇస్తుంటే, మరికొన్ని ప్రభుత్వాలు కరెంట్ ఉచితంగా ఇస్తున్నాయి. ఇది కామన్. ఇందులో పెద్దగా వింతేమీ లేదు. కానీ, ఓ ప్రభుత్వం తమ ప్రజలకు కండోమ్స్ ఫ్రీగా ఇవ్వనుంది అంటే నమ్ముతారా? ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. మరీ కామెడీగా ఉంది కదూ. కానీ, ఇది నిజం. ఆ దేశ ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా కండోమ్ లు ఇవ్వనుంది. ఛీఛీ.. మరీ..చీప్ గా కండోమ్స్ ఇవ్వడం ఏంటి? అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ, దీని వెనుక కారణం తెలిస్తే ఆ దేశ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టలేము.

Also Read..Condoms Expensive : వామ్మో.. ఒక కండోమ్ ప్యాకెట్ ధర రూ.60వేలు.. ఎందుకంత రేటు అంటే

ఇంతకీ ఆ దేశం ఏదో చెప్పలేదు కదూ. అదే ఫ్రాన్స్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కండోమ్ లు ఫ్రీగా ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అయితే, ఇది అందరికీ కాదులెండి. కేవలం యువతకు మాత్రమే. 18-25 ఏళ్ల మధ్య వయసున్న యువతీ, యువకులకు మాత్రమే త్వరలో ఫ్రీగా కండోమ్ లు అందుబాటులో ఉంచనున్నట్టు దేశాధ్యక్షుడు ప్రకటించారు. అవాంఛిత గర్భాన్ని, లైంగిక వ్యాధులను నిరోధించేందుకు, వాటి నుంచి యువతను రక్షించడానికే ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.

Also Read..Condom Holes : వార్నీ.. కండోమ్‌కి కన్నం పెట్టింది.. కటకటాల పాలైంది.. ఆ దేశంలోనే తొలి కేసు

ఓ హెల్త్ డిబేట్ లో యువతతో చర్చించిన దేశాధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. అవాంఛిత గర్భ నిరోధానికి సంబంధించి ఇదో చిరు విప్లవం అని మెక్రాన్ తన నిర్ణయాన్ని అభివర్ణించారు. వచ్చే ఏడాది అంటే 2023 జనవరి 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఫార్మసీల ద్వారా 18-25ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులు ఉచిత కండోమ్‌లను పొందవచ్చని దేశాధ్యక్షుడు ప్రకటించారు. కాగా.. 2020, 2021 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా లైంగిక వ్యాధులు 30శాతం పెరిగినందున ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు దేశాధ్యక్షుడు వివరించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.