Nightclubs: కోవిడ్ వచ్చేసింది.. క్లబ్బులు మూసేయండి

కొవిడ్ మహమ్మారి మరోసారి చెలరేగి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో దాదాపు వ్యాపార సంస్థలు...

Nightclubs: కోవిడ్ వచ్చేసింది.. క్లబ్బులు మూసేయండి

Night Clubs

Nightclubs: కొవిడ్ మహమ్మారి మరోసారి చెలరేగి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో పుట్టిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో దాదాపు వ్యాపార సంస్థలు ఒకొక్కటిగా మూతపడుతున్నాయి. ఫ్రెంచ్ ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ రీసెంట్ గా ఓ కీలక ప్రకటన చేశారు.

‘ఓ నాలుగు వారాల పాటు నైట్ క్లబ్బులు మూసేస్తున్నాం. మళ్లీ జనవరిలోనే వాటిని తెరిచే ప్లాన్ చేస్తున్నాం. వైరస్ వ్యాప్తి యువతలోనే ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాక్సినేషన్ వేసుకున్న వారిలోనూ కరోనా వ్యాప్తి ఉంటుంది. ఎందుకంటే అటువంటి ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకుని ఉండటమనేది అంత సులువైన పని కాదు’ అని ప్రెస్ కాన్ఫిరెన్స్ లో చెప్పారు.

ఫ్రెంచ్ హెల్త్ మినిష్ట్రీ కథనం ప్రకారం.. కొవిడ్ మహమ్మారి కారణంగా ఐదో వేవ్ ను ఎదుర్కొంటుంది ఫ్రాన్స్. 11వేల 300 పాజిటివ్ కేసులు ఉన్నాయని తెలిసింది. దేశవ్యాప్తంగా లక్షా 13వేల మంది కరోనా కారణంగా చనిపోయారు.

……………………………………… : విక్కీ – కత్రినా పెళ్లి ఫుటేజ్ కోసం 100కోట్ల డీల్