షాకింగ్ : పిల్లిపిల్ల అనుకుని పులిపిల్లను కొనుక్కున్న దంపతులు..

  • Published By: nagamani ,Published On : October 12, 2020 / 03:53 PM IST
షాకింగ్ :  పిల్లిపిల్ల అనుకుని పులిపిల్లను కొనుక్కున్న దంపతులు..

French : సరదా కోసం చాలామంది పిల్లి పిల్లల్ని పెంచుకుంటుంటారు. అలా ఇద్దరు దంపతులు ఓ పిల్లిపిల్లను కొని తెచ్చుకున్నారు. కానీ ఆ పిల్ల పెరుగుతుంటే చూస్తున్నవాళ్లు భయాందోళనలకు గురవుతున్నారు.ఎందుకంటే ఆ పిల్లకు పులి లక్షణాలు బైటపడుతున్నాయి. అలా అది పెరుగుతున్నకొద్దీ వాళ్లలో భయం కూడా పెరుగుతోంది. అది క్రమంగా పెరుగుతున్న సమయంలో తాము తెచ్చుకున్నది పిల్లిపిల్లకాదు కాదు.. పులిపిల్ల అని నిర్థారించుకున్నారు.


దీంతో వాళ్లు భయపడిపోయి పోలీసులకు చెప్పుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ పిల్లిపిల్లను అమ్మినవాళ్లను అరెస్ట్ చేసి లోపలేసారు.ఈ విచిత్ర ఘటన ఫ్రాన్స్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..ఫ్రాన్స్ లోని నార్మండీకి చెందిన లా హవ్రే అనే దంప‌తులు రెండేళ్ల క్రితం సవన్నా జాతికి చెందిన పిల్లిని అమ్ముతున్నట్లు ఆన్‌లైన్ ప్ర‌క‌ట‌న చూశారు.




ఆ బుజ్జి పిల్ల వారికి తెగ నచ్చేసిది. వెంటనే రూ. 6 లక్షలు (6000 యూరోల‌)కు కొనేసుకున్నారు. దాన్ని ఎంతో అపురూపంగా చూసుకునేవారు. ఆడుకునేవారు.ముద్దులు పెట్టుకునేవారు. సెల్ఫీలు తీసుకునేవారు. ఇంట్లో ఉన్న సమయమంతా దాంతోనే గడిపేవారు. ఇలా వారం గడిచింది. రెండు వారాలు గడిచాయి. తర్వాత ఆ పిల్లిపిల్ల పెరుగుతుంటే అసలు విషయం బైటపడటం ప్రారంభించింది.


పులి లక్షణాలు బైటపడుతుండటంతో తాము కొన్ని తెచ్చుకున్నది..పులి పిల్ల అని తెలుసుకొని భయపడిపోయారు. వెంటనే పోలీసులకు ఈ విషయం చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు ఆన్ లైన్ లో దాన్ని అమ్మిన 9మంది వ్యక్తుల్ని కనిపెట్టి అరెస్ట్ చేసి విచారించగా..దాన్ని ఇండోనేషియా నుంచి జంతువుల అక్రమ రవాణాదారులు ఆన్ లైన్ అమ్ముతున్నట్లుగా తేలింది.



అది వైల్డ్ క్యాట్ అని దాన్ని చూసి సాధారణ పిల్లిగా భావించి వారు కొన్నారని తేలింది. ఈ జంతువుల అక్రమ రవాణా చేసే మొత్తం 9మందిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆ పులిపిల్లను ఫ్రెంచ్ జీవవైవిధ్య కార్యాలయానికి అప్పగించారు.