Sri Lanka Crisis: శ్రీలంకలో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత.. ఆన్‌లైన్ ద్వారానే పాఠాలు

శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సోమవారం నుంచి శ్రీలంకలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూత పడనున్నాయి. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారు.

Sri Lanka Crisis: శ్రీలంకలో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేత.. ఆన్‌లైన్ ద్వారానే పాఠాలు

Srilanka

Sri Lanka Crisis: పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం లేదు. రోజురోజుకు ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుతోంది. అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతున్నప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. టర్నోవర్ ఆధారంగా కంపెనీలు 2.5శాతం చొప్పున సోషల్ కంట్రిబ్యూషన్ ట్యాక్స్ చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.

Srilanka Parliament: భారత్ ను ఉదహరిస్తూ శ్రీలంక పార్లమెంటులో సమూల మార్పులు ప్రతిపాదించిన ప్రధాని రణిల్ విక్రమసింఘే

దేశంలో ఆహార పదార్థాల కొరతతో పాటు పెట్రోల్ కోసం బంకుల వద్ద బారులు తీరే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ క్రమంలో పెట్రోల్ బంక్ వద్ద వేచి ఉండి ఓ వ్యక్తి మృతిచెందినట్లు వార్తలు వచ్చాయి. పెట్రోల్ కోసం ఘర్షణలు పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం నుంచి సెలవులు ప్రకటించింది. కేవలం కొంత మంది ఉద్యోగులు (వైద్య సిబ్బంది మినహా) మాత్రమే రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Viral Video: మెరుపుల బండి.. ట్విటర్‌లో ఆసక్తికర వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహింద్రా

శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సోమవారం నుంచి శ్రీలంకలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూత పడనున్నాయి. కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తారు. ఈ విధానం రెండు వారాల పాటు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక్కడ మరోవిషయం ఏమిటంటే.. కార్యాలయాలు మూసిఉంచిన రోజుల్లో ఆహార కొరతను అదిగమించడానికి తోటపని లేదా స్వల్పకాలిక పంటల సాగులో పాల్గొనాలని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సూచించింది.