Georgia Airline: జార్జియా దేశ అధ్యక్షురాలిని తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించిన జార్జియా ఎయిర్‭లైన్స్

జార్జియన్ అధికారులు విమానాల పునఃప్రారంభాన్ని స్వాగతించినప్పటికీ, యూరోపియన్ యూనియన్‌కు అనుకూలంగా రష్యా నుంచి దూరం ఉండాలని కోరుకునే కొంతమంది కోరుకుంటున్నారు. ఇక జార్జియాలో కొంతమంది ఆదివారం సెంట్రల్ టిబిలిసిలో నిరసన కూడా చేశారు

Georgia Airline: జార్జియా దేశ అధ్యక్షురాలిని తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించిన జార్జియా ఎయిర్‭లైన్స్

Georgia Airline – Flight Ban: రష్యాకు విమానాలను తిరిగి ప్రారంభించినందుకు గాను జార్జియా జాతీయ విమానయాన సంస్థ అయిన జార్జియన్ ఎయిర్‌వేస్‭తగ బహిష్కరిస్తానని ఆ దేశ అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచ్విలి చేసిన హెచ్చరికలపై సదరు విమానయాన సంస్థ తీవ్రంగా స్పందించింది. ఏకంగా దేశ అధ్యక్షురాలు సలోమ్ జౌరాబిచ్విలి (Salome Zourabichvili)నే తమ విమానాల్లో ప్రయాణించకుండా నిషేధించింది. జార్జియాతో ప్రత్యక్ష విమానాలపై నాలుగేళ్ల నాటి నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు, రష్యాకు ప్రయాణించే జార్జియన్లకు దశాబ్దాల నాటి వీసా అవసరాన్ని తొలగిస్తున్నట్లు రష్యా ఈ నెల మొదట్లో ప్రకటించింది.

Mumbai : బోరివాలి టూ అంథేరి.. డెయిలీ ముంబయి లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న డాగ్

రష్యా చేసిన ఈ ప్రతిపాదనపై సలోమ్ జౌరాబిచ్విలి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జార్జియా నుంచి రష్యాకు అనుకూలంగా ఎలాంటి అడుగులు పడకూడదని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో జార్జియన్ ఎయిర్‌వేస్ ఏకంగా రష్యాకు విమానాలు నడిపేందుకు సిద్ధమైంది. అయితే అధ్యక్షురాలిపై ప్రైవేట్ యాజమాన్యంలోని జార్జియన్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు తమజ్ గయాష్‌విలి ఆగ్రహం వ్యక్తం చేశారు. జార్జియన్ ప్రజల ముందు ఆమె క్షమాపణలు చెప్పే వరకు నిషేధిం ఎత్తివేసేది లేదని తేల్చి చెప్పారు.

Bihar Politics: ఓట్లు అడిగిన ప్రజలనే నోట్లు అడుగుతున్న నేత.. వింత పద్దతిలో ఎన్నికల ప్రచారం

జార్జియన్ అధికారులు విమానాల పునఃప్రారంభాన్ని స్వాగతించినప్పటికీ, యూరోపియన్ యూనియన్‌కు అనుకూలంగా రష్యా నుంచి దూరం ఉండాలని కోరుకునే కొంతమంది కోరుకుంటున్నారు. ఇక జార్జియాలో కొంతమంది ఆదివారం సెంట్రల్ టిబిలిసిలో నిరసన కూడా చేశారు. వాస్తవానికి జార్జియన్ ప్రజల నుంచి రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంత మంది రష్యాకు దూరంగా ఉండాలని అంటుండగా, మరికొందరు కలిసేందుకు సముఖంగా ఉన్నారు. ఇక ప్రభుత్వం సైతం కొంత అనుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లో యుద్ధంపై రష్యాపై ఆంక్షలు విధించేందుకు జార్జియా ప్రభుత్వం నిరాకరించింది.