China GIrl : మాజీ ప్రియుడికి బుద్దిచెప్పాలనుకుంది.. కానీ చివరకు దొరికిపోయింది

ప్రేమలో ఉన్నప్పుడు వారి పలకరింపులు వేరుగా ఉంటాయి. కొత్తకొత్త పేర్లతో పిలుచుకుంటారు. బంగారం, బుజ్జి, బేబీ అంటూ కబుర్లు చెప్పుకుంటారు. ఇంత ప్రేమగా పిలుచుకునే ప్రేమికులు బ్రేకప్ తర్వాత ఒకరిపై ఒకరు పట్టరాని కోపంతో ఉంటారు. ఎలాగోలా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్స్ వేస్తుంటారు. ఆలా కొందరు భౌతికంగా దాడి చేస్తే మరికొందరు మానసికంగా దెబ్బతీస్తాడు. తాజాగా ఓ యువతి తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త వ్యూహం రచించింది.

China GIrl : మాజీ ప్రియుడికి బుద్దిచెప్పాలనుకుంది.. కానీ చివరకు దొరికిపోయింది

Girl Rent Ex Boyfriend Car And Jump Traffic Signals

China GIrl : ప్రేమలో ఉన్నప్పుడు వారి పలకరింపులు వేరుగా ఉంటాయి. కొత్తకొత్త పేర్లతో పిలుచుకుంటారు. బంగారం, బుజ్జి, బేబీ అంటూ కబుర్లు చెప్పుకుంటారు. ఇంత ప్రేమగా పిలుచుకునే ప్రేమికులు బ్రేకప్ తర్వాత ఒకరిపై ఒకరు పట్టరాని కోపంతో ఉంటారు. ఎలాగోలా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్స్ వేస్తుంటారు. ఆలా కొందరు భౌతికంగా దాడి చేస్తే మరికొందరు మానసికంగా దెబ్బతీస్తాడు. తాజాగా ఓ యువతి తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు సరికొత్త వ్యూహం రచించింది.

అతడిని ఆర్ధికంగా దెబ్బతీనే విధంగా భారీ జరిమానా కట్టించాలని ప్లాన్ చేసింది, కానీ ఆమె వేసిన ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది. ఇక ఘటన వివరాల్లోకి వెళితే తూర్పు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఓ యువతి, అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఆ యువకుడు మరో యువతితో ప్రేమలో పడటంతో అది నచ్చక మొదటి ప్రేయసి బ్రేక్ అప్ చెప్పింది. ప్రియుడు తనను మోసం చేశాడని మనసులో పెట్టుకొని ఎలాగైనా దెబ్బకొట్టాలనుకుంది.

ఈ నేపథ్యంలోనే వేరే స్నేహితుడి సాయంతో అతడి కారును అద్దెకి తీసుకుంది. ఆ కారును ట్రాఫిక్ రూల్స్ కి విరుద్దంగా నడిపింది. రెండురోజుల్లోనే 50 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లగించింది. అనుమానం వచ్చిన పోలీసులు కారును ఆపి మహిళను విచారించారు. దీంతో ఆమె అసలు విషయం పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకొని జరిమానాలు రద్దు చేసి ఆమె మాజీ ప్రియుడికి ఇచ్చారు. దీంతో ఆమె వేసిన ప్లాన్ అట్టర్ ప్లాప్ అయింది.