United Nations : అఫ్ఘాన్ కు రూ.8,836 కోట్ల ఆర్ధిక సాయం

ఆహార కొరత, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న అఫ్ఘానిస్తాన్ ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి.

United Nations : అఫ్ఘాన్ కు రూ.8,836 కోట్ల ఆర్ధిక సాయం

United Nations

Updated On : September 15, 2021 / 11:56 AM IST

United Nations :  అఫ్ఘాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత ఆకర కొరత ఏర్పడింది. పనులు లేకపోవడంతో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ తరుణంలోనే అఫ్ఘాన్ కు సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. కరువు, పేదరికం, ఆహార కొరతతో సతమతమవుతున్న అఫ్ఘాన్ కష్టాలు తీర్చేందుకు 1.2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8,836 కోట్లు) ఆర్ధిక సాయం చేస్తామని పలు దేశాలు ప్రకటించాయి. ఈ విషయాన్నీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ వెల్లడించారు. ఉగ్రవాదం పెచ్చరిల్లకుండా చూడడం, మానహక్కుల పరిరక్షణ తదితర సమస్యలపైనా ప్రపంచ దేశాలు తమ వంతు కృషిచేయాలని గుటెర్రస్‌ సూచించారు.

అఫ్ఘాన్ కు సత్వర ఆర్ధిక సాయం కోరుతూ ఐరాస సోమవారం జెనీవాలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వచింది.. ఈ ఏడాది అవసరాలు తీర్చేందుకు కనీసం 60.6 కోట్ల డాలర్ల సాయం చేయాలనీ గుటెర్రస్ కోరగా దానికి రెండు రేట్లు సాయం చేశారు. మొత్తం 1.2 బిలియన్ డాలర్లు వచ్చినట్లు ఆయన ప్రకటించారు. అఫ్ఘాన్ విషయంలో ప్రపంచ దేశాలు మానవతా దృక్పధంతో వ్యవహరిస్తున్నాయని, అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా విరాళాలు వస్తున్నాయని తెలిపారు.

ఇదే సమయంలో అక్కడ చేపట్టాల్సిన కార్యక్రమంలపై ఆంటోనియో గుటెర్రస్ మాట్లాడారు. తాలిబన్ల అనుమతి లేకుండా అక్కడ మానవతా కార్యక్రమాలు చేపట్టడం అసాధ్యమని తెలిపారు. అక్కడి ప్రజలకు సాయం అందాలంటే తాలిబన్‌ ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు కొనసాగించాల్సిందే’ అని ఆయన స్పష్టంచేశారు. స్థానికుల భవిష్యత్‌ అగమ్యగోచరమైన నేపథ్యంలో ఐరాస అక్కడ సహాయ కార్యక్రమాలను కొనసాగించడం తప్పనిసరి’ అని గుటెర్రస్‌ వ్యాఖ్యానించారు.