Covid-19 Death Toll : 30లక్షలు దాటేసిన కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. భారత్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌లలో కరోనా పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.

Covid-19 Death Toll : 30లక్షలు దాటేసిన కరోనా మరణాలు

Global Covid 19 Death Toll Surpasses 30 Lakh Amid New Wave

Global Covid-19 death toll : ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. భారత్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌లలో కరోనా పరిస్థితులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. వాస్తవ మరణాల సంఖ్య భారీగానే ఉంటాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 7 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 12వేల మందికిపైగా మరణిస్తున్నారు.

అమెరికాలోనే ఇప్పటివరకు 5.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం మొత్తం మరణాల్లో ఆరింట ఒక వంతు అమెరికాలోనే నమోదవుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌, మెక్సికో, భారత్‌, బ్రిటన్‌ ఉన్నాయి. కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది..

ప్రపంచ దేశాలన్నీ మరోసారి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతం చేస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరత పలు దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. పలు దేశాల్లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, అస్ట్రాజెనెకా టీకాలపై తాత్కాలిక నిషేధం విధించారు.