లేచిన వేళ బాగుంది : 2 నిమిషాల ఆలస్యమే అతన్ని కాపాడింది!

లేచిన వేళ బాగుంది.. భూమి మీద నూకలు ఉండబట్టే.. బతికిపోయాడు. విమానం బయల్దేరే సమయం అయింది. రెండు నిమిషాల ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. అప్పటికే ఫ్లయిట్ టేకాఫ్ అయింది.

  • Published By: sreehari ,Published On : March 11, 2019 / 09:00 AM IST
లేచిన వేళ బాగుంది : 2 నిమిషాల ఆలస్యమే అతన్ని కాపాడింది!

లేచిన వేళ బాగుంది.. భూమి మీద నూకలు ఉండబట్టే.. బతికిపోయాడు. విమానం బయల్దేరే సమయం అయింది. రెండు నిమిషాల ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. అప్పటికే ఫ్లయిట్ టేకాఫ్ అయింది.

లేచిన వేళ బాగుంది.. భూమి మీద నూకలు ఉండబట్టే.. బతికిపోయాడు. విమానం బయల్దేరే సమయం అయింది. రెండు నిమిషాల ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. అప్పటికే ఫ్లయిట్ టేకాఫ్ అయింది. కానీ, ఆ రెండు నిమిషాల ఆలస్యమే.. అతడి ప్రాణాలను కాపాడింది. లేదంటే.. ఇథియోపియా ఎయిర్‌లైన్‌ ప్రమాదంలో ప్రాణాలు పోయి ఉండేవి. గ్రీక్ దేశానికి చెందిన ఆంటోనీస్ మావ్రోపోలస్ అనే వ్యక్తి ఈ బోయింగ్ 737 ప్యాసింజర్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది.
Read Also : ‘సివిజిల్’ యాప్ :ఎల‌క్ష‌న్ కంప్ల‌యింట్స్ ఎవ‌రైనా చేయొచ్చు

ఆ రోజు కొద్దిగా ఆలస్యం కావడంతో ప్లయిట్ మిస్సయ్యాడు. తాను ఎక్కాల్సిన విమానం మిస్ అయిందని బాధపడిన ఆంటోనీస్.. విమాన ప్రమాదానికి గురైందని తెలియగానే షాకయ్యాడు. తాను ఆ విమానం ఎక్కపోవడమే మంచిది అయిందని లేదంటే.. తాను కూడా ప్రాణాలతో మిగిలి ఉండేవాడిని కాదని తన ఫేస్ బుక్ అకౌంట్ లో చెప్పుకొచ్చాడు.

‘ప్లయిట్ టైం అయిందని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించా. కానీ, అప్పటికే గేట్ క్లోజ్ చేశారు. గేట్ దాటి వెళ్లేందుకు నాకు ఎవరూ సాయం చేయలేదు. ఆ రోజు.. నాకు అదృష్టమైన రోజు’ అంటూ తన ప్లయిట్ టికెట్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నైరోబిలో జరిగే యూఎన్ ఎన్విరాన్ మెంట్ ప్రొగ్రామ్ కు గ్రీక్ దేశీయుడు ఆంటోనీస్ హాజరుకావాల్సి ఉందని, విమానం మిస్ కావడంతో తాను హాజరు కాలేకపోయానని తెలిపాడు. గేటు దగ్గర నిలబడిన తనను అధికారులు ఎయిర్ పోర్టులోని పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారని, అక్కడి అధికారి ఒకరు తనను గొడవ చేయొద్దని, దేవున్ని ప్రార్థించమని సూచించినట్టు ఆంటోనీస్ తెలిపాడు.
Read Also : ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి

ఇథియోపియా ఎయిర్‌లైన్‌కు చెందిన బోయింగ్‌ 737 పాసింజర్‌ విమానం ఆదివారం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. రాజధాని అడీస్‌ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. విమానంలో మొత్తం 150 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది విమాన సిబ్బంది అంతా మృతిచెందారు. విమానంలో 33దేశాలవాళ్లు ఉన్నట్లు ఇథియోపియా ఎయిర్ లైన్ తెలిపింది.

Read Also : లైటింగ్ ఎఫెక్ట్ : ఎయిర్‌పోర్ట్‌ తరహాలో వ‌ర‌ల్డ్ క్లాస్ రైల్వే స్టేష‌న్లు