Facebook: ఫేస్‌బుక్ కలిపింది ఆ తల్లీకూతుళ్లని..

ఆరేళ్ల బాలికగా తప్పిపోయిన యువతి 14ఏళ్ల తర్వాత తల్లిని కలుసుకుంది. సోషల్ మీడియా కారణంగా జరిగిన శుభపరిణామాల్లో ఇదొకటి. టెక్సాస్ లోని లారెడో వేదికగా ఈ బంధం ఒకటైంది.

Facebook: ఫేస్‌బుక్ కలిపింది ఆ తల్లీకూతుళ్లని..

Mom And Daughter

Facebook: ఆరేళ్ల బాలికగా తప్పిపోయిన యువతి 14ఏళ్ల తర్వాత తల్లిని కలుసుకుంది. సోషల్ మీడియా కారణంగా జరిగిన శుభపరిణామాల్లో ఇదొకటి. టెక్సాస్ లోని లారెడో వేదికగా ఈ బంధం ఒకటైంది. అమెరికా.. మెక్సికో సరిహద్దుల్లో చూసుకున్న తల్లీ కూతుళ్లు రెండ్రోజులు ఎదురుచూసి కలుసుకున్నారు. తల్లిని కలుసుకోవాలనే తపనతో ఆ యువతి పడిన తపన ఫలించింది.

తల్లి ఒడికి చేరుకున్న యువతి ఆనందభాష్పాలతో సంతోషాన్ని వ్యక్తపరిచింది. ఫ్లోరిడా క్లెర్మంట్‌లోని ఇంటి నుంచి ఆరు సంవత్సరాల వయస్సున్న జాక్వలైన్‌ హెర్నాండెజ్‌ కిడ్నాప్‌కు గురైంది. ఫ్లోరిడాలో పెరిగి పెద్దదైన ఆమె తల్లితో ఎడబాటును కథలుగా ఫేస్‌బుక్‌లో రాసేది. జాక్వలైన్‌ మెసేజ్‌ చదివిన ఒకరి ద్వారా, ఆమె తల్లి టెక్సాస్‌లో ఉన్నట్లు తెలుసుకుంది.

అలా ఆమె ఫేస్‌బుక్‌ పేజీకి నేరుగా మెసేజ్‌ పెట్టింది. పరుగున వెళ్లిన తల్లి ఏంజెలికా వెన్సెస్‌ సల్గాడో.. క్లెర్మాంట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం కిడ్నాప్ కు గురైన బాలిక అని ఓ యువతి చెప్తుందని తనకు పోలీసులు సహాయం చేయాలని ఏంజెలికా అడిగింది. పలు డాక్యుమెంట్లను సిద్ధం చేసిన పోలీసులు.. జాక్వలైన్‌ హెర్నాండెజ్‌ చెప్పేది వాస్తవమని, కలుసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

‘నమ్మశక్యం కాని ఎమోషనల్ స్టోరీ సుఖాంతం అయినందుకు సంతోషంగా ఉంది. తప్పిపోయిన వారు కలుసుకోవాలని చేసిన ప్రార్థనలు ఫలించాయి’ అని పోలీసులు పేర్కొన్నారు.