వీర్య కణాలు మీరు అనుకున్నట్లు కదలవు.. వాటి రూటే సపరేటు

10TV Telugu News

వీర్యకణాలు మనమంతా అనుకున్నట్లు.. ఇన్ని రోజులు సైంటిఫిక్ వీడియోల్లో చూసినట్లు అవి అండాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోవట. వాటిది నేరుగా అండం వరకూ చొచ్చుకుపోయే స్వభావం కాదని చెప్తోంది కొత్త స్టడీ. అవి ఈదడం నిజమే కానీ, ఒకదాని చుట్టూ మరొకటి పల్టీలు కొడుతూ.. ముందుకు వెళ్తుంటాయట.బ్రిస్టల్ యూనివర్సిటీ సైంటిస్టులు సైన్స్ అడ్వాన్సెస్ లో పబ్లిష్ అయిన జర్నల్ లో ఈ విధంగా పేర్కొన్నారు. త్రీ డైమన్షనల్ మైక్రోస్కోపీలో వీర్యకణాల కదలికలపై స్టడీ చేశారు. ఈ అబ్జర్వేషన్ లో ఫాదర్ ఆఫ్ మైక్రోబయోలజీగా పిలిచే డచ్ సైంటిస్ట్ ల్యూవెన్ హోక్.. బ్యాక్టీరియా, ఎర్ర రక్త కణాలపై అప్పట్లోనే సంచలన విషయాలు చెప్పారు.

వ్యాన్ ల్యూవెన్‌హోక్ తన వీర్యంపైనే 1677లో మైక్రోస్కోపుతో స్టడీ చేశారు. సంవత్సరం తర్వాత దీని గురించి రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో ప్రచురించారు. అందులో అతని వీర్య కణాలు.. తోకతో పాములా ఈదుతున్నట్లు చెప్పారు. నీళ్లలో ఈల్ చేపలు మాదిరిగా మూవ్‌మెంట్ ఉందని వెల్లడించారు.అది టూ డైమన్షనల్ మైక్రోస్కోపు కాబట్టి.. ఆయన చూసిన యాంగిల్ ప్రకారం అవి కదులుతూ ముందుకు వెళ్తున్నట్లు మాత్రమే తెలిసిందని సైంటిస్ట్ హెర్మ్స్ గాదెలా అంటున్నారు. వీర్య కణాలు తోకను ఒకవైపుకే ఊపుతూ ఒక దాని చుట్టూ ఒకటి రొటేట్ అవుతూ ముందుకు వెళ్తున్నాయని వివరించారు.

మానవ వీర్యం ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ స్క్రూ మాదిరి ముందుకు చొచ్చుకుపోతుంది. వన్ సైడెడ్ స్ట్రోక్ తో ముందుకు వెళ్తుంది. తోకను కదిపినప్పుడు వీర్యం తల కూడా కదులుతుంది. ఇక దీనిని ఫిజిక్స్ భాషలో చెప్పాలంటే సూర్యుడు చుట్టూ భూమి, బుధుడు తిరిగినట్లన్నమాట.మెక్సికోలోని నేషనల్ ఆటానమస్ యూనివర్సిటీ ఆల్బెర్టీ డార్జ్ సన్ డిస్కవరీలో ‘వీర్యం అనేది రొటేట్ అవుతూ ఉంటూనే సహజంగా అండం రూపాంతరం చెంది పిండంగా వృద్ధి అవుతుంది’ అని వీర్యకణాలు ఈదడంపై తెలిపారు.

Human Sperm, Sperm, Sperm Swim, Otters, eel