కోవిడ్ వైరస్ ట్రీట్మెంట్‌కు… ఇద్దరి చైనా డాక్టర్ల చర్మరంగే నల్లగా మారిపోయింది

  • Published By: veegamteam ,Published On : April 22, 2020 / 07:12 AM IST
కోవిడ్ వైరస్ ట్రీట్మెంట్‌కు… ఇద్దరి చైనా డాక్టర్ల చర్మరంగే నల్లగా మారిపోయింది

కరోనా ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ల కలర్ మారిపోయింది. కరోనా ఇన్ఫెక్షన్ల కారణంగా కాలేయ దెబ్బతిని రంగు మారిపోతున్నారు. రెండు నెలలుగా యీ ఫాన్, హూ వీఫెంగ్ లు పేషెంట్లకు చికిత్స చేసే క్రమంలో హాస్పిటల్ లోనే గడుపుతున్నారు. దీంతో కార్డియోలజిస్టు, యూరాలజిస్టులకు జనవరి 18న కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. 

చైనా మీడియా కథనం ప్రకారం.. వూహాన్ పల్మనరీ హాస్పిటల్లో వారు చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో గుండె, ఊపిరి తిత్తులకు సంబంధించి బైపాస్ మెషీన్ల ద్వారా చికిత్స తీసుకుంటున్నారు. వారికి ఎక్స్‌ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్జిజనేషన్(ఈసీఎమ్ఓ) టెక్నిక్ ద్వారా అంటే నేరుగా రక్తంలోకి ఆక్సిజన్ ను పంపే పద్ధతి ద్వారా చికిత్స చేస్తున్నారు. 

‘నేను ఒక్కసారిగా స్పృహ కోల్పోయాను. కొద్ది సేపటి తర్వాత నా పరిస్థితి ఏంటో నాకు తెలిసింది. నాకు భయం వేసింది’ అని ఇన్ఫెక్షన్‌కు గురైన డాక్టర్ అంటున్నారు. సాంగ్ జియాంక్సిన్ ఇతరుల ప్రాణాలు కాపాడే క్రమంలో డాక్టర్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముంది. కాలేయం పనితీరు చెడిపోతే అందులో ఉండే ఐరన్.. రక్త కణాలను బయటకు పంపించేస్తుంటుంది. ఫలితంగా చర్మం రంగు మారడం, పిగ్మెంటేషన్ కు గురికావడం జరుగుతాయి. 

యూరాలజిస్ట్ అయిన ఆ డాక్టర్ రంగు మారడానికి ఇదే కారణం. చికిత్స మొదలైనప్పటికే ఆయన రంగు మారిపోయింది. వారు హాస్పిటల్లో ట్రీట్ మెంట్ చేసినందుకే ఇలా అయిందనుకోలేం. కరోనా వైరస్ పేషెంట్లలో చాలా మందికి నేరుగా లివర్ డ్యామేజ్ అయిన వారు కూడా ఉన్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ల ద్వారా కాలేయ కణాలపై దుష్ప్రభావం కనిపిస్తుంది. 

సుమారుగా 2-10శాతం కొవిడ్-19పేషెంట్లు డయేరియాతో బాధపడతారు. ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి మెడికేషన్ తప్పనిసరిగా అవసరం కాలేయం పాడైతే విషమ పరిస్థితికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్వాస సంబంధిత సమస్యలు కూడా రావొచ్చు. కొందరిలో కొవిడ్-19 తగ్గిన వెంటనే లివర్ డ్యామేజి కూడా క్యూర్ అయిపోతుంది. 

దీని కోసమే కొవిడ్ పేషెంట్లకు లివర్ ప్రొటెక్టివ్ డ్రగ్స్ కూడా ఇచ్చి కాపాడుకుంటున్నారు. వ్యాధి తగ్గిపోయిన తర్వాత చర్మం పాత రంగులోకే మారిపోతుందట. వైరస్ బారిన పడిన ఆ డాక్టర్లు పేషెంట్ల కంటే ఎక్కువగా భయపడుతుండటంతో కౌన్సిలింగ్ ఇస్తున్నారు నిపుణులు. ఈ మేరకు నిపుణులు ఏమంటున్నారంటే.. కరోనా వైరస్ శరీరంలోని ప్రధాన భాగాలను డ్యామేజి చేస్తుంది. 
లక్షణాలు బయటపడ్డ వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. గుండె, లివర్, కిడ్నీలు, బ్రెయిన్, ఎండోక్రిన్ గ్రంథుల వ్యవస్థ, రక్త సరఫరా దెబ్బతింటే తిరిగి కోలుకోలేమంటున్నారు రీసెర్చర్స్.