America: ఐడా బీభత్సం.. వరుస తుఫానులతో చిగురుటాకులా అగ్రరాజ్యం!

ప్రకృతి విపత్తు ముందు మనుషులెంత.. ప్రకృతి ఆగ్రహం ముందు అగ్రరాజ్యాలైనా వణికిపోవాల్సిందే. అమెరికా పరిస్థితి ఇప్పుడు ఇదే. వరుస తుఫానులతో అమెరికా చిగురుటాకులా వణుకుతుంది.

America: ఐడా బీభత్సం.. వరుస తుఫానులతో చిగురుటాకులా అగ్రరాజ్యం!

America

America: ప్రకృతి విపత్తు ముందు మనుషులెంత.. ప్రకృతి ఆగ్రహం ముందు అగ్రరాజ్యాలైనా వణికిపోవాల్సిందే. అమెరికా పరిస్థితి ఇప్పుడు ఇదే. వరుస తుఫానులతో అమెరికా చిగురుటాకులా వణుకుతుంది. గత వారం సంభవించిన హెన్రీ తుఫాను అమెరికాను తీవ్రంగా దెబ్బతీసింది. దాని నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుఫాన్‌ విరుచుకుపడింది. అమెరికాలోని పలు రాష్ట్రాలలో ఐడా తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. భారీ వర్షాల కారణంగా న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాలు జలమయం అయ్యాయి.

భారీ వర్షాలు, వరదల కారణంగా న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలలో 46 మంది చనిపోగా న్యూయార్క్‌ నగరంలో ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోగా వీరిలో రెండేండ్ల బాలుడు ఉన్నాడు. ఈ రెండు రాష్ట్రాలలో రవాణా సేవలను పూర్తిగా నిలిపివేయగా ఎడతెరిపి లేని వానలతో న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో రోడ్లు, సబ్‌వేలు పూర్తిగా నీటిలో మునిగి జన జీవనం అస్తవ్యస్తమైంది. ఈ రెండు రాష్ర్టాల్లో ఎమర్జెన్సీ విధించగా.. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

ఇక, నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ మొట్ట మొదటి సారి ఆకస్మిక వరద హెచ్చరికలను జారీ చేసింది. న్యూయార్క్‌లో బుధవారం రాత్రి రికార్డు స్థాయిలో ఒక్క గంటలోనే 9 సెంటీమీటర్ల వాన కురిసిందట ఇక్కడి ఎంతటి వర్షాలు కురిసాయో అర్ధం చేసుకోవచ్చు. తుఫాను క్రమంగా న్యూ ఇంగ్లండ్‌ వైపు కదులుతుండగా.. ఈ క్రమంలో భారీ టోర్నడోలు సంభవించవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు తుఫాన్ల ధాటికి అమెరికా అల్లాడిపోతుంటే.. ఆఫ్రికా తీరంలో ఏర్పడిన లారీ తుఫాన్‌ బలపడి చురుగ్గా అమెరికా వైపుకు కదలడంతో భయాందోళనలు నెలకొన్నాయి.