అక్కడ ఒక బాక్స్ నూడుల్స్ ఖరీదు 2 గ్రాముల బంగారంతో సమానం, 10 కిలోల బియ్యం ధర 4 గ్రాముల బంగారంతో సమానం

  • Published By: naveen ,Published On : July 4, 2020 / 02:45 PM IST
అక్కడ ఒక బాక్స్ నూడుల్స్ ఖరీదు 2 గ్రాముల బంగారంతో సమానం, 10 కిలోల బియ్యం ధర 4 గ్రాముల బంగారంతో సమానం

* ఒక నూడుల్స్ బాక్స్ ధర 2 గ్రాముల బంగారంతో సమానం(అంటే రూ.10వేలు)
* 10 కిలోల బియ్యం ధర గోల్డ్ రూపంలో 4 గ్రాముల బంగారంతో సమానం(అంటే రూ.20వేలు)

ఇదీ ఇండోనేషియా దేశంలోని పలు మారుమాల ప్రాంతాల్లో నిత్యావసరాల ధరలు. షాకింగ్ గా ఉంది కదూ. కానీ ఇది నిజం. కొన్ని మారుమూల ప్రాంతాల్లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా పపువాలోని కోరోవాయి అనే ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణం. కోరోవాయి గోల్డ్ మైనింగ్ ప్రాంతం. ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఉంటుంది. అక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం. హెలికాప్టర్ లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 5 రిజెన్సీలు మీదుగా ప్రయాణం చేయాలి. ఆ తర్వాత రెండు రోజుల పాటు నడవాల్సి ఉంటుంది. అప్పుడు కోరోవాయి చేరుకుంటారు.

corona Virus Affect Gold Price High

శాపంగా మారిన రవాణ సౌకర్యం:
సరైన రవాణ సౌకర్యం లేని కారణంగానే ఈ ప్రాంతంలో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయని స్థానికులు చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ తలరాత మాత్రం మారడం లేదని వాపోతున్నారు. గనుల తవ్వకమే స్థానికులకు ప్రధాన జీవనోపాధి. ఇక్కడ బంగారు గనులు నిక్షేపంగా ఉన్నాయి. అయినా ఎవరూ ఉండటానికి ఇష్టపడటం లేదు. కనీస సౌకర్యాలు లేని కారణంగా అందూ కోరోవాయి ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. తిండికి తీవ్రమైన తిప్పలు పడాల్సి వస్తోంది. ఏది కొనుక్కోవాలన్నా కష్టమే. భారీగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి నిత్యావసరాల సరుకులు రావాల్సి ఉంటుంది. హెలికాప్టర్లలో సరుకులు రవాణ చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే వాటికి అంత ధర.

* గోల్డ్ మైనింగ్ ప్రాంతమైన కోరోవాయిలో కిలో రైస్ బ్యాగ్ ధర రూ.10వేలతో సమానం, అంటే ఓ స్మార్ట్ ఫోన్ ధరతో సమానం
* జకర్తాలో 10 కిలో బియ్యం ధర రూ.10వేలు
* కోరోవాయిలో ఒక బాక్స్ నూడుల్స్ ధర 2 గ్రాముల బంగారంతో సమానం
* మరికొన్ని చోట్ల 10 కిలోల బియ్యం ధర 4 గ్రాముల బంగారంతో సమానం, అదే క్యాష్ రూపంలో అయితే రూ.10వేలు
* నిత్యావసరాలు కొనుగోలు చేయడం కన్నా సెల్ ఫోన్ కొనడం ఈజీ

Read:కరోనా ఎఫెక్ట్: 7500 ఉద్యోగాల కోత