ఆవులను పొగిడేస్తున్న పాక్ పీఎం ఇమ్రాన్‌ఖాన్

ఆవులను పొగిడేస్తున్న పాక్ పీఎం ఇమ్రాన్‌ఖాన్

pakistan-pm-imran-khan

Pakistan PM about Cows: ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా గ్రూపుల్లో ఇండియన్లు ఆవు పేడను, మూత్రాన్ని వాడతారంటూ ప్రచారం జరిగేది. ఆవుల నుంచి ఇవన్నీ వస్తాయని ఇండియాలో ప్రచారం చేసిన ప్రముఖుల జాబితాలో పాకిస్తాన్ నుంచి అక్కడి పీఎం ఇమ్రాన్ ఖాన్ కూడా చేరిపోయారు.

ప్రముఖ ఇంగ్లీష్ కవి విక్టర్ హుగో చెప్పినట్లు.. ‘సమయం వచ్చినప్పుడు ఏ ఐడియాను ఎవ్వరూ నాశనం చేయలేరు’ ఇప్పుడు ఆ ఐడియా ఆవు గురించే. దాని నుంచి మనం ఏ పొందగలం. పాకిస్తాన్ లో అనేక దశాబ్దాల తర్వాత ఈ ఐడియా ఉద్భవించింది. పవిత్రంగా చూసుకునే ఆవు నుంచి వచ్చే పాలతో ఎన్నో సమకూరుతున్నాయి.

ప్రస్తుతం సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఆవుపాలతో బయటపడగలదని పీఎం ఖాన్ అంటున్నారు. మిత్ర దేశమైన చైనా పాకిస్తానీ ఆవుల నుంచి రోజుకు ఆరు సార్లు పాలిచ్చేలా చేయగలవట. అలాంటి క్షీర నదులు దేశంలో పారే అవకాశముంటే ఎవరు మాత్రం ఆపాలనుకుంటారు?

ఆవు పేడ నుంచి బస్సులు నడిపించొచ్చు. ఏ విషయాన్ని తీసి పారేయకూడదు. ఆవును కించపరచని వాళ్లంతా చరిత్ర సృష్టించగలిగారు. ఆ పేడ కూడా దేశానికి చాలా ఉపయోగపడుతుంది. వాతావరణాన్ని కాపాడుకునే క్రమంలో బస్సులను కూడా దీనితోనే నడిపించాలని పీఎం ఖాన్ సూచిస్తున్నారు.

ఈ లంచగొండులకు గుణపాఠం చెప్పాల్సిందే. వారందరికీ ఎటువంటి ఉపశమనం కల్పించేది లేదు. ఎప్పుడైనా ఇటువంటి విషయాలు వినబడితే ఊరుకునేదే లేదని పీఎం చెబుతున్నారు.

గ్రాండ్ గోబర్ ప్లాన్
మినిస్టర్ జార్తజ్ గుల్ మాట్లాడుతూ.. కరాచీలోని బైన్స్ కాలనీలో బస్సులు ఆవు పేడతో నడవనున్నాయన్నారు. ఇది కేవలం బస్సుల వరకూ ఆపేయడం ఎందుకు ఆవు పేడతో ఎలక్ట్రిసిటీ కూడా ఉత్పత్తి చేయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు జీవితం మొత్తంలో ఎప్పుడూ చీకటి ఉండదని అంటున్నారు.