United Nation: హిందీ భాష విస్తృతి కోసం ఐక్యరాజ్య సమితికి రూ.8 కోట్లు ఇచ్చిన భారత్

అధికారిక ట్విట్టర్ ఖాతాను 50,000 ఫాలోవర్లు ఉండగా, అధికారిక ఇన్‭స్టాగ్రామ్ ఖాతాకు 29,000, అధికారిక ఫేస్‭బుక్ ఖాతాకు 15,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మూడు ఖాతాల్లో కలిసి సుమారు 1,000 వరకు చేసి ఉంటారు

United Nation: హిందీ భాష విస్తృతి కోసం ఐక్యరాజ్య సమితికి రూ.8 కోట్లు ఇచ్చిన భారత్

Hindi Language: ప్రపంచ దేశాల మధ్య భాషాపరమైన కమ్యూనికేషన్ సహా హిందీ భాషా విస్తృతి కోసం ఐక్య రాజ్య సమితికి భారత్ 8.2 కోట్ల రూపాయలను అందించింది. ఐరాసాలో భారత్ అంబాసిడర్, పర్మినెంట్ రిప్రజెంటేటివ్ అయిన రుచిర కాంబోజ్ దీనికి సంబంధించిన చెక్కును ఐక్యరాజ్య సమితి గ్లోబల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సెక్రెటరీ జనరల్ మెలిస్సా ఫ్లెమింగుకి అందజేశారు.

Pawan Kalyan: ఢిల్లీ చేరుకుని కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్

హిందీ@ఐక్యరాజ్య సమితి అనే కార్యక్రమాన్ని 2018లో ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది యూఎన్ దీన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ దేశాల్లో హిందీ భాషను రక్షించడంతో పాటు దాన్ని మరింత విస్తృతం చేయడం, ప్రపంచ వ్యాప్తంగా హిందీ మాట్లాడే వారి సమస్యలను ప్రస్తావించడం, పరిష్కారాలు చూపడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

JP Nadda: ఎన్డీఏ సమావేశంలో ఈ అంశాలపై చర్చిస్తాం.. ఇవే మాకు ముఖ్యం: జేపీ నడ్డా

దీని కోసం సోషల్ మీడియాలో ఖాతాలు ఏర్పాటు చేశారు. అధికారిక ట్విట్టర్ ఖాతాను 50,000 ఫాలోవర్లు ఉండగా, అధికారిక ఇన్‭స్టాగ్రామ్ ఖాతాకు 29,000, అధికారిక ఫేస్‭బుక్ ఖాతాకు 15,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మూడు ఖాతాల్లో కలిసి సుమారు 1,000 వరకు చేసి ఉంటారు. ఇక దీనితో పాటు ఐక్యరాజ్య సమితి హిందీ న్యూస్ వెబ్‭సైటుకు 13 లక్షల వ్యూస్ ఉన్నట్లు ఐరాసాలోని ఒక అధికారి తెలిపారు.