బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయులకు చోటు!

  • Published By: venkaiahnaidu ,Published On : November 18, 2020 / 04:51 PM IST
బైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయులకు చోటు!

Indian American Vivek Murthy, Arun Majumdar Likely Faces In Biden’s Cabinet కొద్ది రోజుల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా 46వ దేశాధ్య‌క్షుడిగా జో బైడెన్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే బైడెన్ ఏర్పాటు చేయ‌బోయే మంత్రివ‌ర్గంలోకి ఇద్ద‌రు ముఖ్యమైన భార‌తీయ అమెరిక‌న్ల‌ు వివేక్ మూర్తి,అరుణ్ మజుందార్ కు చోటు ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సమాచారం.



హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీస్ మంత్రిగా వివేక్‌ మూర్తిని జో బైడెన్ నియ‌మించే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ అరుణ్ మ‌జుందార్‌కు..ఇంధ‌నశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సమాచారం.



https://10tv.in/kashmir-non-muslim-student-got-first-rank-islamic-studies/
వివేక్ మూర్తి(43) ప్రస్తుతం, బైడెన్ ఏర్పాటు చేసిన కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ లో కో-చైర్మెన్ గా ఉన్న విషయం తెలిసిందే. మాజీ యుఎస్ సర్జన్ జనరల్ అయిన మూర్తి.. ప్రజారోగ్య నిపుణుల బృందానికి, బైడెన్ కి, ఉపాధ్యక్షరాలిగా పదవి చేపట్టనున్న కమలా హారిస్ కి తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. కర్ణాటటకు చెందిన మూర్తి(43)ని అమెరికా 19వ సర్జన్‍ జనరల్‍గా అప్పటి (2014) అధ్యక్షుడు ఒబామా నియమించారు. బ్రిటన్‍లో పుట్టిన వివేక్‍ మూర్తి 37 ఏళ్ల వయసులోనే సర్జన్‍ జనరల్‍గా నియమితులై రికార్డు సృష్టించారు. అయితే తర్వాత వచ్చిన ట్రంప్‍ ప్రభుత్వం ఆయనను వైదొలగాలని కోరిన విషయం తెలిసిందే.



అదేవిధంగా, అడ్వాన్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ-ఎనర్జీ మొదటి డైరక్టర్ గా సేవలందించిన స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అరుణ్ మజుందార్..ఇంధన సంబంధ విషయాలపై బైడెన్ కి టాప్ అడ్వైజర్ గా ఉన్నారు.