హ్యాండ్‌ బ్యాగ్‌లో లక్ష అమెరికన్ డాలర్లు.. మహిళ అరెస్ట్

  • Published By: vamsi ,Published On : May 13, 2019 / 02:14 AM IST
హ్యాండ్‌ బ్యాగ్‌లో లక్ష అమెరికన్ డాలర్లు.. మహిళ అరెస్ట్

డాలర్లను అక్రమంగా తరలిస్తుంది అనే ఆరోపణతో వందన సోని అనే 44ఏళ్ల మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌కు చెందిన ఆమెను లక్ష అమెరికన్‌ డాలర్లు కలిగి ఉన్న కారణంగా నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు.

నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి దగ్గర 5 వేల అమెరికన్‌ డాలర్లను మాత్రమే ఉంచుకోవాలి. అంతకుమించి తీసుకుని వెళ్లడం చట్టప్రకారం నేరం. అందుకే ఆమెను అరెస్ట్ చేసినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు.  నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎక్కేందుకు బోర్డింగ్‌ పాయింట్‌కు వస్తుండగా సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు.

తనిఖీలు చేసే సమయంలో డాలర్లను ఆమె తన హ్యాండ్‌ బ్యాగ్‌లో ఎవరికీ కనిపించకుండా దాచినట్లు విమానాశ్రయ సిబ్బంది గుర్తించారు.