Vikram S: నింగిలోకి దూసుకెళ్లనున్న భారత మొదటి ప్రైవేట్ రాకెట్

డాక్టర్ విక్రమ్ సారాబాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యవస్థాపకుడు. ఆయనకు నివాళిగా తమ ప్రయోగ వాహనాలకు విక్రమ్ అని పేరు పెట్టింది స్కైరూట్ ఎరోస్పేస్. విక్రమ్ పేరుతో మొత్తం మూడు రాకెట్లున్నాయి. ఇవన్నీ కూడా చిన్న శాటిలైట్లను ప్రయోగించడం కోసం అభివృద్ధి చేసినవే. వీటిలో విక్రమ్ I మొదటిది

Vikram S: నింగిలోకి దూసుకెళ్లనున్న భారత మొదటి ప్రైవేట్ రాకెట్

India’s first private rocket Vikram S launch date confirmed

Vikram S: ఓ ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన భారత మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ఈ నెల 18న ఆకాశంలోకి దూసుకెళ్లడానికి సిద్ధమైంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే స్కైరూట్ ఎరోస్పేస్ అనే సంస్థ తయారు చేసిన ఈ రాకెట్, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. దీంతో భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు కంపెనీలు అడుగు పెట్టినట్టైంది.

మన దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యానికి 2020లో నాంది పడింది. దీనికి వీలు కల్పించే సంస్కరణలకు శ్రీకారం చుడుతూ, 2020 జూన్‌లో మోదీ ప్రభుత్వం ఇన్-స్పేస్‌ఈ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. ప్రస్తుతం ఇస్రోకు, ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలకు మధ్య అనుసంధానకర్తగా ఈ సంస్థ పని చేస్తోంది. 2040 నాటికి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష పరిశ్రమ విలువ 80 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ఈ మార్కెట్‌ నుంచి లబ్ధి పొందాలని భారత్ ఆశిస్తోంది. అయితే ప్రస్తుతం వరల్డ్ స్పేస్ ఎకానమీలో భారత్ వాటా దాదాపు 2 శాతమే. దీన్ని అధిగమించడం కోసమే అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వాములను ప్రోత్సహించాలని భారత్ ప్రయత్నిస్తోంది.

డాక్టర్ విక్రమ్ సారాబాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యవస్థాపకుడు. ఆయనకు నివాళిగా తమ ప్రయోగ వాహనాలకు విక్రమ్ అని పేరు పెట్టింది స్కైరూట్ ఎరోస్పేస్. విక్రమ్ పేరుతో మొత్తం మూడు రాకెట్లున్నాయి. ఇవన్నీ కూడా చిన్న శాటిలైట్లను ప్రయోగించడం కోసం అభివృద్ధి చేసినవే. వీటిలో విక్రమ్ I మొదటిది. ఇది 480 కిలోల లోపు బరువున్న చిన్న శాటిలైట్లను భూకక్ష్యకు దిగువ వరకూ మోసుకెళ్తుంది. తర్వాత వచ్చే విక్రమ్ II, విక్రమ్ III రాకెట్లు భారీ పేలోడ్స్‌ను తీసుకెళ్లగలుగుతాయని భావిస్తున్నారు.

విక్రమ్-స్ రాకెట్‌ మొత్తం మూడు చిన్న శాటిలైట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. వీటిలో రెండు భారత్‭కు చెందినవి కాగా, మూడవది విదేశీ సంస్థది. ఈ రాకెట్‌కు సంబంధించిన ఫుల్ డ్యూరేషన్ టెస్ట్‌‭ను మేలో విజయవంతంగా పూర్తి చేశామని స్కైరూట్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఈ మొట్టమొదటి మిషన్‌కు ‘ప్రారంభ్’ అని పేరు పెట్టింది. నిజానికి ఈ విక్రమ్-ఎస్ ప్రయోగం నవంబర్ 12-16 మధ్య జరగాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో నవంబర్ 18కి వాయిదా వేసినట్టు స్కైరూట్ ఎరోస్పేస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

OnePlus Oppo Chargers : భారత్‌ మార్కెట్లో వన్‌ప్లస్, ఒప్పో స్మార్ట్‌ఫోన్ల రిటైల్ బాక్సుల్లో ఇక ఛార్జర్ ఉండదు.. ఎందుకో తెలుసా?