Pakistan Economy: అందుకే పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం: అమెరికా, పాక్ అధికారులు
ఉక్రెయిన్ లో యుద్ధం వల్ల తమ దేశంలో ఆహార, ఎరువుల కొరత ఏర్పడిందని అమెరికాలోని పాక్ రాయబారి మసూద్ ఖాన్ చెప్పారు. పాకిస్థాన్ కోలుకుంటున్న సమయంలో వరదలు ముంచెత్తాయని పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయని చెప్పారు. పాక్ లో వ్యవసాయ రంగం కేవలం ఆహార భద్రతకు మాత్రమే కాకుండా ఎగుమతులకు కూడా చాలా కీలమని తెలిపారు.

Pakistan Economy: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న నేపథ్యంలో ఆ దేశ అధికారులతో అమెరికా ఆర్థిక నిపుణులు తాజాగా వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు. పాకిస్థాన్ ఆర్థిక దుస్థితికి దారి తీసిన పరిస్థితులు, సమీప భవిష్యత్తులో పాక్ ఎదుర్కొనే ముప్పు, ఇతర అంశాలపై చర్చించారు. ఆహార సంక్షోభం, ఉక్రెయిన్ యద్ధం, ద్రవ్యోల్బణం, పాక్ రూపాయి మారకం విలువ రోజురోజుకీ పడిపోతుండడం పాకిస్థాన్ ముందు ఉన్న సమస్యలని అధికారులు అన్నారు.
ఉక్రెయిన్ లో యుద్ధం వల్ల తమ దేశంలో ఆహార, ఎరువుల కొరత ఏర్పడిందని అమెరికాలోని పాక్ రాయబారి మసూద్ ఖాన్ చెప్పారు. పాకిస్థాన్ కోలుకుంటున్న సమయంలో వరదలు ముంచెత్తాయని పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయని చెప్పారు. పాక్ లో వ్యవసాయ రంగం కేవలం ఆహార భద్రతకు మాత్రమే కాకుండా ఎగుమతులకు కూడా చాలా కీలమని తెలిపారు.
అందుకే ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. కాగా, పాక్ తో అమెరికా సత్సంబంధాలు ప్రధానంగా ఉగ్రవాదంపై యుద్ధం చేయడానికేనని, వాతావరణ మార్పులు, విపత్తుల గురించి కాదని అమెరికా అధికారులు తెలిపారు. పాక్ లో చాలా కాలం నుంచి ఆర్థిక, రాజకీయ స్థిరత్వంలేకపోవడంతో ఇప్పుడు శ్రీలంక తరహా పరిస్థితులు నెలకొంటున్నాయి. అప్పుల కోసం పాక్ ఎదురు చూస్తోంది.
Unstoppable : అన్‌స్టాపబుల్ సీజన్-3 రామ్‌చరణ్‌తో ప్రారంభం అవ్వబోతుందా.. ఆహా కంటెట్ హెడ్ ఏమన్నాడు?