Pakistan Economic Crisis: పాకిస్థాన్‌కు మరో తలనొప్పి.. భారీ జరిమానా చెల్లించాలంటున్న ఇరాన్ ..

2009లో పాకిస్థాన్, ఇరాన్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. పాకిస్థాన్ తన భూభాగంలో దాదాపు 800 కిలో మీటర్ల మేర పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయిన తరువాత ఇరాన్ పాకిస్థాన్‌కు గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పాకిస్థాన్ భూభాగంలో పైప్‌లైన్ ఏర్పాటు పనులు పూర్తికాలేదు.

Pakistan Economic Crisis: పాకిస్థాన్‌కు మరో తలనొప్పి.. భారీ జరిమానా చెల్లించాలంటున్న ఇరాన్ ..

Pakistan

Pakistan Economic Crisis: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. విద్యుత్ కోతలు, నిత్యావసర వస్తువులుసైతం దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. గోదుమ పిండికోసం రోజూ ఆదేశంలో ఏదోఒక చోట ఘర్షణలు జరుగుతున్నాయి. దాదాపు 23కోట్ల జనాభా కలిగిన పాకిస్థాన్ దాదాపు దివాలా అంచులో నిలిచింది. మరోవైపు పాకిస్థానీ రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. కొంతలోకొంతైనా ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కేందుకు ఐఎంఎఫ్ సహాపాశ్చాత్య దేశాలను రుణంకోసం ఆ దేశం అభ్యర్థనలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో పాక్ కు మరో తలనొప్పి వచ్చిపడింది. పాకిస్థాన్ పై 18బిలియన్ డాలర్ల జరిమానా విధిస్తామని ఇరాన్ దేశం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్థానీ రూపాయిల్లో దీని విలువ దాదాపు 48,960 కోట్లు. భారీ జరిమానాకు ఇరాన్ డిమాండ్ చేయడానికి గ్యాస్ పైపులైన్ కారణం.

Pakistan Economy: అందుకే పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం: అమెరికా, పాక్ అధికారులు

2009లో పాకిస్థాన్, ఇరాన్ మధ్య గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం.. పాకిస్థాన్ తన భూభాగంలో దాదాపు 800 కిలో మీటర్ల మేర పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఈ పనులు పూర్తయిన తరువాత ఇరాన్ పాకిస్థాన్‌కు గ్యాస్ సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు పైప్‌లైన్ ఏర్పాటు పనులు పూర్తికాలేదు. 14ఏళ్లుగా ఆ పనులు నిలిచిపోయాయి. ఇరాన్ తమ భూభాగంలో పైపులైన్ ఏర్పాటు పనులు పూర్తిచేసింది.

Pakistan economic crisis: పాకిస్థాన్ చేరుకున్న‌ ఐఎంఎఫ్‌ బృందం.. నిధులు వ‌స్తాయా?

2009 ఒప్పందం మేరకు ఇరాన్ భూభాగంలో గ్యాస్ పైప్‌లైన్ పనులు పూర్తిచేశామని, మీ భూభాగంలో పైప్‌లైన్ పనులు పూర్తిచేయాలని పాక్ పై కొన్నేళ్లుగా ఒత్తిడి తెలుస్తోంది. పాకిస్థాన్ మాత్రం.. మా భూభాగంలో గ్యాస్ పైప్ లైన్ పూర్తికాకపోవటానికి ఇరాన్ పై అమెరికా విధించిన ఆంక్షలే కారణమని పేర్కొంటూ వస్తుంది. ప్రతీసారి అమెరికా విధించిన ఆంక్షలను తెరపైకి తెస్తూ ఇరాన్ వాదనకు పాక్ సమాధానం ఇస్తుంది. పాకిస్థాన్ జాప్యం వల్ల ఇబ్బంది పడిన ఇరాన్ పాక్ పై భారీ జరిమానా విధించాలని నిర్ణయించుకుంది. అయితే, తాజా నివేదికల ప్రకారం.. 2024 మార్చి వరకు ఇరాన్  పాకిస్థాన్‌కు గడువునిస్తూ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఇరాన్ – పాకిస్థాన్ గ్యాస్ పైప్‌లైన్ వచ్చే ఏడాది మార్చి వరకు పూర్తిచేయకుంటే తదుపరి చర్యలకు దిగుతామని ఇరాన్ తెలిపినట్లు సమాచారం.