Weight loss : అడవికి వెళ్లి .. 63కిలోల బరువు తగ్గించుకుని వచ్చిన వ్యక్తి.. షాక్ అయిన బంధువులు

బరువు తగ్గాలనుకుని నిర్ణయించుకున్న ఓ వ్యక్తి ఏకంగా కుటుంబాన్ని వదిలి అడవులకు వెళ్లిపోయాడు. అక్కడ పగలు రాత్రి కష్టపడ్డారు. 63 కిలోల బరువు తగ్గి ఇంటికొచ్చాడు. అతనికి చూసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు షాక్ అయ్యారు.

Weight loss : అడవికి వెళ్లి .. 63కిలోల బరువు తగ్గించుకుని వచ్చిన వ్యక్తి.. షాక్ అయిన బంధువులు

Irish Man 7 Months, Returns On Thanksgiving After Shedding 63 Kg

Weight loss : అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ బద్దకం..నిర్లక్ష్యం..సమయాభావం ఇలాంటి పలు కారణాలతో ఆ పనిని వాయిదా వేస్తుంటారు. ఫలితంగా మరింత బరువు పెరుగుతారు. దీంతో అనారోగ్య సమస్యలు మేమున్నాం అంటూ ఎంటర్అయిపోతాయి. ఆ తరువాత బరువు తగ్గే యత్నాలు చేసినా మరింత ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అందరిలాగానే తాను కూడా బరువు తగ్గాలని అనుకున్న ఓ వక్తి వాయిదా వేస్తు వచ్చాడు.అలా ఒకటీ రెండు కాదు ఏకంగా 15 సంవత్సరాల పాటు వాయిదా వేశాడు. ఫలితంగా బరువు భారీగా పెరిగాడు. అలా పెరిగి పెరిగీ 153 కిలోలు అయిపోయాడు. ఆ భారీ శరీరంతో చాలా ఇబ్బంది పడేవాడు. ఈక్రమంలో ఓ పుస్తకం చదివి..ఎలాగైనా బరువు తగ్గాలని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అలా తీసుకున్న అతను కుటుంబాన్ని,స్నేహితులను కూడా వదిలేసి అడవులకు వెళ్లిపోయాడు.ఏడు నెలల్లో 63 కిలోలు తగ్గి ఇంటికి తిరిగి వచ్చేసరికి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు బంధువులు కూడా షాక్ అయ్యారు? ఆనందం వ్యక్తంచేశారు. బరువు తగ్గిన తన ప్రయత్నాలను..సంకల్ప బలాన్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేసేసరి అతను కాస్తా వైలర్ అయిపోయాడు. బరువు తగ్గాలనుకునేవారికి స్పూర్తిగా మారిపోయాడు. అతను ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్, 2 లక్షలకు పైగా లైక్‌లు, అనేక కామెంట్స్ వచ్చాయి.

అతని పేరు కీఫ్. ఐరిష్ వ్యక్తి. మూడు ఏళ్ల క్రితం అమెరికాకు చెందిన డేవిడ్ గోగ్గిన్స్ అనే అల్ట్రామారథాన్ రన్నర్ అనే వ్యక్తి రాసిన కాంట్ హర్ట్ అనే పుస్తకం చదివిన కీఫ్. తన బరువు తగ్గించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. పుస్తకంలో ఉన్న మీ వైఫల్యాలను గుర్తించండి..వాటినికి విశ్లేషించుకుని పూర్తి చేయండి అనే కీలక వాఖ్యాలను వంటపట్టించుకున్నాడు. ఆ వాఖ్యాలు అతనిపై ప్రభావాన్ని చూపాయి. తన స్నేహితులు..కుటుంబ సభ్యులు డిన్నర్ లకు వెళ్లేటప్పుడు తాను కూడా వెళ్లేవాడు. వెళ్లకుండా ఉందామనుకున్నా ఉండలేకపోయేవాడు. అక్కడ తినటం తాగటం ఇలా భారీగా బరువు పెరిగి 153 కిలోలకు చేరుకున్నాడు. అదే తన బలహీనత అని గుర్తించాడు. అందుకే ఇంటివద్దే ఉంటే అది సాధ్యం కాదనుకున్నాడు. మల్లోర్కాలోని అడవికి వెళ్లాడు. తన ఈ ప్రయాణం గురించి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు.

అలా ఏడు నెలలపాటు అడవిలోనే వ్యాయామాలు చేస్తు ఉండిపోయాడు. ప్రకృతిని గమనిస్తు ఆస్వాదిస్తూ ప్రకృతిలో మమేకమైపోయాడు. ఏడు నెలలపాటు నడక, స్మిమ్మింగ్,రన్నింగ్ లు చేస్తునే ఉండవాడు. ఏడు నెలల్లో తాను ఒక్కరోజు కూడా బద్దకించలేదని అనుకున్న టార్గెట్ పూర్తి అయ్యేదాకా విశ్రమించేది లేదని నిర్ణయించుకున్నాడనని తెలిపారు కీఫ్. ఈ క్రమంలో ఎన్నో గాయాలయ్యాయి. కానీ ఆగలేదు. నొప్పి తీవ్రంగా బాధిస్తున్నా ఆగలేదు. అలా కీఫ్ మొదటి వారాల్లో రోజుకు 90 నిమిషాలు వాకింగ్. వారానికి ఆరు రోజులు వెయింట్ లిఫ్టింగ్, మూడుసార్లు స్విమ్మింగ్, రన్నింగ్ చేశాడు. అలా ఒంట్లో పేరుకుపోయిన క్యాలరీలను కరిగించటానికి చేయని వర్కౌంట్ లేవు. బరువు తగ్గాలని చేసే యత్నంలో క్యాలరీలు కరిగిస్తూనే ఆహారంలో మార్పులు చేసుకున్నాడు. మానసికంగా ధృఢంగా ఉండాలని ముందే నిర్ణయించుకుని బరువు తగ్గే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఒక్కరోజు కూడా విశ్రమించకుండా కష్టపడ్డాడు.

అలా ఏడు నెలల్లో 63 కిలోల బరువు తగ్గాడు. తరువాత ఆయన ఇంటికొచ్చి కుటుంబ సభ్యులకు..స్నేహితులకు, బంధువులకు సర్పైజ్ ఇచ్చాడు. అతనికి చూసినవారి ఇచ్చిన స్పందనను వీడియో తీసి తను బరువు తగ్గటానికి చేసిన యత్నాలను..ఈక్రమంలో పడిన ఇబ్బందులను తన ఇస్టాలో షేర్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.