Pakistan: పోలీసులు తన టయోటా కారు ఎత్తుకెళ్లారని వీడియో షేర్ చేసిన పీటీఐ నేత

ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మధ్య పరిస్థితులు ఉప్పునిప్పుగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్‭ను భద్రతా దళాలు అరెస్ట్ చేయడంతో పాకిస్తాన్ దద్దరిల్లింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. అయితే కోర్టు కూడా ఈ చర్యలను తప్పుపట్టడంతో ఎట్టకేలకు ఖాన్ విడుదలయ్యారు

Pakistan: పోలీసులు తన టయోటా కారు ఎత్తుకెళ్లారని వీడియో షేర్ చేసిన పీటీఐ నేత

PTI: ఆదివారం ఇస్లామాబాద్ పోలీసులు తన ఇంటిపై దాడి చేసి తన వాహనాన్ని దొంగిలించారని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి ప్రధాన కార్యదర్శిగా కొత్తగా నియామకమైన ఒమర్ అయూబ్ ఖాన్ అన్నారు. కొంత మంది పోలీసులు కారును తీసుకెళ్తున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. అనంతరం పోలీసులను ఎగతాళి చేస్తూ “దొంగలను పట్టుకోవడానికి దొంగలను పిలవాలి” అని ప్రశ్నించారు.

Coffin Remark: పార్లమెంటును శవ పేటికతో పోల్చిన ఆర్జేడీపై విపక్షాల విమర్శలు

‘‘షాలిమార్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇస్లామాబాద్ పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా అర్థరాత్రి మళ్లీ నా ఇంటిపై దాడి చేసి పార్క్ చేసిన టయోటా హై లక్స్ ట్విన్ క్యాబిన్ మోడల్ 2011ని దొంగిలించారు. ఇస్లామాబాద్ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. శోధనల నుంచి ఇప్పుడు వాహనాల దొంగతనాల వరకు ఎదిగారు’’ అని అయూబ్ ఖాన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Manipur: 8 గంటల ఆపరేషన్‭లో 40 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించిన మణిపూర్ సీఎం

ప్రభుత్వానికి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి మధ్య పరిస్థితులు ఉప్పునిప్పుగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఇమ్రాన్ ఖాన్‭ను భద్రతా దళాలు అరెస్ట్ చేయడంతో పాకిస్తాన్ దద్దరిల్లింది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. అయితే కోర్టు కూడా ఈ చర్యలను తప్పుపట్టడంతో ఎట్టకేలకు ఖాన్ విడుదలయ్యారు. ఇక అయూబ్ ఖాన్ విషయానికి వస్తే.. శనివారంమే పీటీఐ సెక్రటరీ జనరల్‌గా నియమితులయ్యారు. అనంతరం ఆయన స్పందిస్తూ “ఇది గొప్ప గౌరవం. నేను పాకిస్తాన్, పీటీఐ కోసం నిరంతరం పని చేస్తాను. ఛైర్మన్, మా పీటీఐ సభ్యుల అంచనాలను అందుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను” అని అన్నారు.