విమానంలో ఘోరంగా కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో వైరల్

Viral Video: విమానంలోని అటెండంట్లు గొడవను చల్లార్చడానికి ఎంతగానో ప్రయత్నించారు.

విమానంలో ఘోరంగా కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో వైరల్

విమానంలో కొందరు ప్రయాణికులు ఘోరంగా కొట్టుకున్నారు. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ఈవా ఎయిర్ కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తన పక్కన కూర్చుకున్న ప్రయాణికుడు దగ్గుతుండడంతో ఓ వ్యక్తి తన సీటు నుంచి లేచి మరో సీటులో కూర్చున్నాడు. కాసేపటికి ఓ వ్యక్తి వచ్చి ఆ సీటుతనదని, అక్కడి నుంచి లేవాలని గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరూ పరస్పరం పిడిగుద్దులు కురిపించుకునే ప్రయత్నాలు చేశారు.

విమానంలోని అటెండంట్లు గొడవను చల్లార్చడానికి ఎంతగానో ప్రయత్నించారు. విమానంలో ఇంత పెద్ద గొడవ జరుగుతోంటే మిగతా ప్రయాణికులు భయపడిపోయారు. గొడవకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ఖాళీ సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు వాగ్వివాదానికి దిగారని చెప్పాడు.

ఇటువంటి ప్రయాణికులను విమానంలోకి మరోసారి ఎక్కనివ్వకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వారి వల్ల మిగతా ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంటుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ట్రాఫిక్‌ రూల్స్‌పై ఈ చిన్నారులు ఎంత చక్కగా అవగాహన పొందుతున్నారో చూడండి