Video: ట్రాఫిక్‌ రూల్స్‌పై ఈ చిన్నారులు ఎంత చక్కగా అవగాహన పొందుతున్నారో చూడండి

ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించాలని సజ్జనార్ అన్నారు.

Video: ట్రాఫిక్‌ రూల్స్‌పై ఈ చిన్నారులు ఎంత చక్కగా అవగాహన పొందుతున్నారో చూడండి

Traffic Rules

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రతిరోజు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారి వల్ల వారికే కాకుండా ఇతరులకూ ప్రాణహాని కలుగుతోంది.

ట్రాఫిక్ నిబంధనలు, బాధ్యతగా వాటిని పాటించాల్సిన అవసరం వంటి అంశాలపై చిన్నప్పటి నుంచే అవగాహనకు వస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు. ఇటువంటి బాధ్యతతోనే ఓ స్కూల్లో చిన్నారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

తాజాగా, ఈ వీడియోను తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా పోస్ట్ చేశారు. ‘చిన్నతనంలో ట్రాఫిక్ రూల్స్ పై ఈ పిల్లలు అవగాహన కల్పిస్తోన్న తీరు అభినందనీయం. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల జరిగే అనర్ధాల గురించి ఒక్కొక్కటిగా పిల్లలకు అవగాహన కల్పించాలి.

తల్లిదండ్రులు, టీచర్స్ వారిలో సామాజిక స్పృహను నింపాలి’ అని ఆయన సూచించారు. జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనాలను మెల్లిగా పోనివ్వకపోతే ఎదురయ్యే ప్రమాదాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటించకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి చిన్నారులు చక్కగా నటించి చూపారు.

Also Read: ఓట్లు వేయబోమని ఫ్లెక్సీలు కట్టిన గ్రామస్థులు.. ఐదేళ్ల క్రితమూ ఇలాగే నిరసన.. ఇప్పటికీ సమస్యల పరిష్కారం లేదు..