ఓట్లు వేయబోమని ఫ్లెక్సీలు కట్టిన గ్రామస్థులు.. ఐదేళ్ల క్రితమూ ఇలాగే నిరసన.. ఇప్పటికీ సమస్యల పరిష్కారం లేదు..

Garimallapadu Villagers: గ్రామంలో ఇళ్లు, ఉపాధి హామీ, రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓట్లు వేయబోమని ఫ్లెక్సీలు కట్టిన గ్రామస్థులు.. ఐదేళ్ల క్రితమూ ఇలాగే నిరసన.. ఇప్పటికీ సమస్యల పరిష్కారం లేదు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడు గ్రామ ఆదివాసీ నగర్‌లో సమస్యలు పరిష్కరించే వరకు ఓట్లు వేయబోమని ఫ్లెక్సీలు కట్టారు గ్రామస్థులు. గ్రామం అంతా ఓట్ల బహిష్కరణ చేస్తామంటున్నారు. ఆ గ్రామంలో మొత్తం 65 కుటుంబాలు, 195 మంది ఓటర్లు ఉన్నారు.

గ్రామంలో ఇళ్లు, ఉపాధి హామీ, రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కూడా గ్రామస్థులు నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కనీసం పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివాసులమైన తమను ప్రభుత్వం, అధికారులు మోసం చేస్తున్నారని తెలిపారు. అందుకే దేవుడి తోడుగా తాము ఈసారి కచ్చితంగా ఓటు వేయం అని ఫ్లెక్సీలతో ప్రదర్శన చేస్తున్నామని చెప్పారు. దీంతో హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు కొత్తగూడెం ఆర్డీవో, డిఎస్పీ, యమ్మర్వో, ఎంపీడీవో, తదితర ప్రభుత్వ అధికారులు.

గ్రామస్థులతో మాట్లాడారు. గతంలోనూ హామీ ఇచ్చి కనీసం పట్టించుకోలేదని పోలీసులు, అధికారులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు వేయడం కనీస బాధ్యత అని, ఓటు వేయకుండా సామూహిక బహిష్కరణ నేరం అని అధికారులు చెప్పారు. అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు. ఓట్లు వేయకుండా ప్రజలను అడ్డుకోవద్దని తెలిపిన పోలీసులు అన్నారు.

Also Read: ఎన్నికల విధులకు గైర్హాజరు.. 40 మందిపై సస్పెన్షన్ వేటు!