బెడ్స్ ఖాళీ చేయటానికి  పేషెంట్లను చంపేసిన డాక్టర్ : నర్సుల చాటింగ్ లో బయటపడ్డ దారుణం

బెడ్స్ ఖాళీ చేయటానికి  పేషెంట్లను చంపేసిన డాక్టర్ : నర్సుల చాటింగ్ లో బయటపడ్డ దారుణం

Italiy Doctor two COVID Patients Murder  for Bed Space : దేవుడు జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడని..అందుకే డాక్టర్లను దేవుడితో పోలుస్తాం. డాక్టర్ ఎంత డబ్బు ఖర్చు అయినా ఫరవాలేదు. ప్రాణాలు కాపాడండీ డాక్టర్ అని కోరుకుంటాం. పోతే తిరిగి రానిది ప్రాణం ఒక్కటే కాబట్టి. కానీ ఆ డాక్టరే ప్రాణాలు తీసేవాడైతే..! ప్రాణాలు పోయాల్సినవాడే ప్రాణాలు తీసేస్తే..!! అదే జరిగింది కరోనా మహమ్మారి కాలంలో. ఓ డాక్టర్ కరోనా పేషెంట్ల ప్రాణాల్ని అత్యంత దారుణంగా తీసేశాడు. దానికి ఆ డాక్టర్ చెప్పిన కారణం వింటే షాక్ అవ్వటమే కాదు..మైండ్ బ్లాంక్ అయిపోతుంది..‘‘హాస్పిటల్ లో బెడ్లు ఖాళీ చేయటానికి సదరు డాక్టర్ కరోనా పేషెంట్ల ప్రాణాలు తీసేసిన ఘటన ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్‌ ఎమర్జెన్సీ వార్డులో జరిగింది…!!

అది ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రిలో కోవిడ్‌ ఎమర్జెన్సీ వార్డు. అక్కడ ‘డాక్టర్‌ కార్లొ మోస్కా’ అనే డాక్టర్  ఇంచార్జిగా పని చేస్తున్నాడు. ఇటలీలో కరోనా కేసులు పెరగటంతో హాస్పిటల్ కు బాధితులు క్యూ కట్టారు. దీంతో అక్కడ బెడ్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. దీంతో డాక్టర్‌ కార్లొ మోస్కా అంత్యంత దారుణ నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ బెడ్లు ఖాళీగా లేకపోవడంతో కొందరు కరోనా పేషెంట్లను చంపేయాలని నిర్ణయించాడు. అదే విషయాన్ని నర్సులకు చాటింగ్ లో చెప్పాడు. దానికి ఓ నర్సులు ‘కేవలం బెడ్లు ఖాళీ అవడం కోసం నేనీ పని చేయలేను’, ‘ఇది చాలా మూర్ఖత్వపు చర్య’ చాలా దారుణం అని డాక్టర్ ను హెచ్చరించారు.

కానీ డాక్టర్ డాక్టర్‌ కార్లొ మోస్కా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంట్లో భాగంగా 61 ఏళ్ల నటాలే బస్సీ అనే కరోనా పేషెంటుని మరో 80 ఏళ్ల ఏంజెలో పలెట్టి అనే పేషెంట్లను చంపాలని ఫిక్స్ అయ్యాడు. దానికి వాళ్లకు ‘మత్తుమందుతో పాటు కండరాల నొప్పులకు వాడే మందులను ఎక్కువ డోసులో ఇచ్చేశాడు’. దీంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. గత మార్చిలో జరిగితన ఈ దారుణ ఘటన మీద పోలీసులు ఇప్పటికీ దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా ఆధారాల కోసం డాక్టర్ కార్లొ మోస్కా నర్సులతో చేసిన చాటింగ్‌ బయటపడింది. ‘కేవలం బెడ్లు ఖాళీ అవడం కోసం నేనీ పని చేయలేను’, ‘ఇది చాలా మూర్ఖత్వపు చర్య’ అంటూ నర్సులు మెసేజ్‌ల ద్వారా అతడిని హెచ్చరించినవి బయటపడ్డాయి.

ఈ పనిచేయటానికి హాస్పిటల్ లో నర్సులు అంగీకరించకపోవటంతో డాక్టర్ కార్లొ మోస్కా రోగులకు మెడిసిన్స్ ఇచ్చే సమయంలో నర్సులను బయటకు వెళ్లిపోమ్మని చెప్పాడు. దానికి మరోసారి నర్సులు డాక్టర్ ని హెచ్చరించినా అతను వినలేదు. ఇవన్నీ పోలీసులు విచారణలో తేలాయి. అలాగే అదే హాస్పిటల్ లో మరణించిన మరో ముగ్గురి చావుకు ఈ డాక్టరే కారణమా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు  కొనసాగిస్తున్నారు.

ఉద్దేశపూర్వకంగా పేషెంట్ల ప్రాణాలు తీశాడన్న ఆరోపణలతో ఎమర్జెన్సీ వార్డ్‌కు హెడ్‌గా ఉన్న అతడిని మోంటిచైరి ఆస్పత్రి విధుల నుంచి తీసివేసింది.  మరోవైపు పోలీసులు అతడిని హౌస్ అరెస్ట్ చేశారు. కానీ డాక్టర్ కార్లొ మోస్కా మాత్రం నేనీపని చేయలేదనీ..ఇవన్నీ ఎవరో కావాలని నన్ను ఇరికిస్తున్నారని వాదిస్తున్నాడు. ప్రాణాలు కాపాడే వాడినే కానీ తీసేవాడిని కానని చెబుతున్నాడు.