Japan Parliament : జపాన్ కొత్త ప్రధాని సంచలన నిర్ణయం..పార్లమెంట్ రద్దు

జపాన్ నూతన ప్రధాన మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో 10 రోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన "ఫుమియో కిషిడా"

Japan Parliament : జపాన్ కొత్త ప్రధాని సంచలన నిర్ణయం..పార్లమెంట్ రద్దు

Japan (3)

Japan Parliament  జపాన్ నూతన ప్రధాన మంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో 10 రోజుల క్రితమే ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన “ఫుమియో కిషిడా”..ఆ దేశ పార్లమెంట్ లోని దిగువ సభను రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. పార్లమెంటు సభ్యుల ఆమోదంతో దిగువ సభ రద్దు అయినట్లు దిగువ సభ స్పీకర్‌ తడమొరి ఓషిమా ధృవీకరించారు. స్పీకర్ ప్రకటన చేసిన సమయంలో సభకు హజరైన దిగువ సభ లోని 465 మంది సభ్యులు లేచి నిలబడి బల్లలు చరిచి తమ అంగీకారం తెలిపారు.

జపాన్ ప్రధాని తాజా నిర్ణయం పై ప్రపంచ దేశాలు నివ్వెర పోయాయి. అయితే జపాన్ ప్రధాని మాత్రం తనను తాను సమర్థించుకున్నారు. తన పాలనకు ప్రజల ఆమోదం పొందేందుకే ఎన్నికలకు వెళ్లున్నట్లు ప్రకటించారు. కిషిడా తాజా నిర్ణయంతో అక్టోబరు 31న జపాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు మార్గం సుగమమైంది.

2017లో చివరి సారిగా జపాన్ దిగువ సభకు ఎన్నికలు జరిగాయి. 2017లో జరిగిన జపాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి షింజో అబె ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే 2020 ఆగస్టు 28న అనారోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నట్లు షింజో అబే ప్రకటించారు.

షింజో అబే రాజీనామా తర్వాత.. యోషిహైజ్ సుగా ప్రధాని పదవిని చేపట్టారు. ఒలింపిక్ క్రీడల నిర్వహణలో ఆయన చాలా విమర్శలను ఎదుర్కోన్నారు. కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోవడం, దేశాన్ని న‌డిపించ‌లేక‌పోతున్నట్టు ప్రధాని సుగా ప్రకటించిన క్రమంలో గత నెలలో అధికార పార్టీలో నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ఫుమియో కిషిడా గెలుపొందిన విషయం తెలిసిందే.