Births in Japan: 123 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జపాన్‌లో భారీగా తగ్గిన జననాల రేటు: దేశ ఉనికికే ప్రమాదం?

గత కొన్నేళ్లుగా జపాన్ లో జననాల రేటు తగ్గుతూనే ఉండగా..గడిచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో జననాలు రేటు పడిపోయింది. జపాన్ జాతీయ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..2021లో దేశంలో కేవలం 811,604 జననాలు జరిగాయి

Births in Japan: 123 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జపాన్‌లో భారీగా తగ్గిన జననాల రేటు: దేశ ఉనికికే ప్రమాదం?

Japan

Births in Japan: రానున్న పదేళ్లలో ప్రపంచ జనాభా భారీగా తగ్గనుందా? ప్రజలు లేక కొన్ని దేశాలు ఉనికి కోల్పోనున్నాయా? ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్న జనాభా గణన డేటా (census data) నివేదికలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇప్పటికే చైనాలో జనాభా సంఖ్య తగ్గిపోతుందని, రానున్న 40 ఏళ్లలో ఆదేశంలో సగానికి సగం జనాభా తగ్గినా ఆశ్చర్య పోనక్కర్లేదని విశ్లేషకులు అంటున్నారు. ఉత్తర అమెరికా, మరికొన్ని ఐరోపా దేశాల్లోనూ జనాభా వృద్ధి గత పదేళ్లలో పోల్చుకుంటే అనుకున్నంత స్థాయిలో లేదు. ఇదిలాఉంటే ఆసియాలోని జపాన్ లోనూ జననాల రేటు భారీగా పడిపోయింది. గత కొన్నేళ్లుగా జపాన్ లో జననాల రేటు తగ్గుతూనే ఉండగా..గడిచిన రెండేళ్లలో రికార్డు స్థాయిలో జననాలు రేటు పడిపోయింది. జపాన్ జాతీయ ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం..2021లో దేశంలో కేవలం 811,604 జననాలు జరిగాయి. ఇది అంతక్రితం ఏడాది(2020)తో పోల్చుకుంటే సరాసరి 3.5 శాతం తక్కువ.

Other Stories: Currency Notes: రోడ్డుపైకి ఎగిరొచ్చిన నోట్లు.. ఎగబడి ఏరుకున్న జనం!.. అసలు విషయం తెలిసి..

గడిచిన 123 ఏళ్లలోనే ఇది అత్యల్ప జననాల రేటుగా ఆరోగ్యశాఖ పేర్కొంది. రికార్డు స్థాయిలో జపాన్ లో జననాల రేటు పడిపోవడం..ఉన్న జనాభాలో ఎక్కువ మంది వృద్ధులు ఉండడంతో జపాన్ లో జనాభా వృద్ధి రేటుపై ఆందోళన కలుగుతుంది. 1975 నుండి జపాన్ లో సంతానోత్పత్తి రేటు 2.0 కంటే తక్కువగా పడిపోతుండగా ఆనాటి నుంచి స్థిరమైన క్షీణత కొనసాగుతూనే ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే..రానున్న 20-25 ఏళ్లల్లోనే జపాన్ దేశం ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని మరీ ఆలస్యం అయితే..ప్రపంచ పటంలో జపాన్ ఒక చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2005 – 2015 మధ్య దేశంలో జననాల రేటు కాస్త మెరుగుపడినప్పటికీ ఆ సంఖ్య స్థిరంగా కొనసాగలేదు.

Other Stories: DGCA: దివ్యాంగుల్ని అడ్డుకోవద్దు.. విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశం

దీనికి తోడు ఇటీవలి కాలంలో కరోనా మహమ్మారి, ఇతర సంక్రమిత వ్యాధుల వ్యాప్తి భయంతో ప్రజలు ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నారని..పెళ్లి, సంతానం గురించి ఆలోచించడం లేదని జపాన్ ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే మిగతా దేశాలతో పోల్చుకుంటే..జపాన్ లో సంతానోత్పత్తి గత 30 ఏళ్లుగా తగ్గుతూనే ఉంది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుండడంతో..దేశంలో పని వయస్కుల సంఖ్య భారీగా తగ్గింది. ఈప్రభావం జపాన్ దేశ ఆర్ధిక వ్యవస్థపై పడిందంటే జపాన్ లో జనాభా కొరత ఏస్థాయికి చేరిందో అర్ధం అవుతుంది. ఈపరిస్థితికి అద్దం పట్టేలా టెస్లా సంస్థ సీఈఓ ఎలాన్ మాస్క్ సైతం జపాన్ జనాభా రేటుపై ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా వృద్ధి రేటు లేని కారణంగా రానున్న రోజుల్లో జపాన్ దేశం కనుమరుగయ్యే పరిస్థితి ఉందంటూ ఎలాన్ మస్క్ గతంలో ట్వీట్ చేశారు.