DGCA: దివ్యాంగుల్ని అడ్డుకోవద్దు.. విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశం

విమానంలో దివ్యాంగుల ప్రయాణానికి అనుమతించాలని ఆదేశించింది డీజీసీఏ (డైరెక్టరేట్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్). ఏదైనా వైకల్యం ఉందనే కారణంతో విమానంలో ప్రయాణించడాన్ని అడ్డుకోవద్దని సూచించింది.

DGCA: దివ్యాంగుల్ని అడ్డుకోవద్దు.. విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశం

Dgca

DGCA: విమానంలో దివ్యాంగుల ప్రయాణానికి అనుమతించాలని ఆదేశించింది డీజీసీఏ (డైరెక్టరేట్ జనలర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్). ఏదైనా వైకల్యం ఉందనే కారణంతో విమానంలో ప్రయాణించడాన్ని అడ్డుకోవద్దని సూచించింది. దీనికి సంబంధించి తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇటీవల రాంచీలో వైకల్యంతో ఉన్న ఒక బాలుడిని విమానంలో ప్రయాణించేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ అనుమతించని సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన డీజీసీఏ ఆ సంస్థకు ఐదు లక్షల జరిమానా విధించింది. ఈ అంశంపై విమానయాన సంస్థలకు కొన్ని సూచనలు చేసింది.

pawan kalyan: వైఎస్ఆర్‌సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలి: పవన్ కళ్యాణ్

‘‘వైకల్యం కారణంగా ఏ వ్యక్తిని విమానంలో ప్రయాణించకుండా అడ్డుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి వ్యక్తి విమానంలో ప్రయాణించడం కారణంగా, తన ఆరోగ్యానికి హాని కలుగుతుందనుకున్నప్పుడు మాత్రమే ప్రయాణాన్ని నిరాకరించాలి. అది కూడా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. వైద్యులు ప్రయాణికుల ఆరోగ్య స్థితిని పరిశీలించి, వాళ్లు విమానంలో ప్రయాణించవచ్చా? లేదా? అనేది నిర్ణయిస్తారు. ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది. ఈ అంశానికి సంబంధించి కాలానుగుణంగా నిబంధనల్లో మార్పులు తెస్తామని చెప్పింది.