Currency Notes: రోడ్డుపైకి ఎగిరొచ్చిన నోట్లు.. ఎగబడి ఏరుకున్న జనం!.. అసలు విషయం తెలిసి..

డబ్బులు అంటే ఎవరికి చేదు చెప్పండి.. రూ.10 నోట్ రోడ్డుపై కనిపించినా చాలు ఎవరైనా కళ్లకు అద్దుకొని మరీ తీసుకుంటారు. డబ్బులు ఉంటేనే మనం అనుకున్న పనులు జరిగే కాలంలో ఉన్నాం. డబ్బుపై ఆశ ఉండటం అనేది మానవ సహజం...

Currency Notes: రోడ్డుపైకి ఎగిరొచ్చిన నోట్లు.. ఎగబడి ఏరుకున్న జనం!.. అసలు విషయం తెలిసి..

Currency

Currency Notes: డబ్బులు అంటే ఎవరికి చేదు చెప్పండి.. రూ.10 నోట్ రోడ్డుపై కనిపించినా చాలు ఎవరైనా కళ్లకు అద్దుకొని మరీ తీసుకుంటారు. డబ్బులు ఉంటేనే మనం అనుకున్న పనులు జరిగే కాలంలో ఉన్నాం. డబ్బుపై ఆశ ఉండటం అనేది మానవ సహజం. ఇదేక్రమంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నోట్లు గాలిలో ఎగిరొచ్చి రోడ్డుపై పడటంతో వాటికోసం స్థానిక ప్రజలు ఎగబడ్డారు. ఎవరికి దిరొకిన నోటును వారు జేబులో వేసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు వచ్చి అసలు విషయం చెప్పేసరికి జేబులో వేసుకున్న నోట్లను అక్కడే పడేసి వెళ్లిపోయారు.

10th Results: నేడు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కొత్త వంతెనపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నోట్లు పడేసుకుంటూ వెళ్లారు. అవి గాలిలో ఎగురుకుంటూ వంతెన పడ్డాయి. అప్పటికే ఆ వంతెనపై ట్రాఫిక్ రద్దీ ఉంది. నోట్లను గాలిలోకి ఎగరడం చూసిన కొందరు వాహనదారులు వాటిని దక్కించుకొనేందుకు తెగ ఆరాట పడ్డారు. ఒకొరికొకరు పోటీపడి మరీ రోడ్డుపై పడ్డ నోట్లను ఏరుకున్నారు. తీరా వాటిని చూస్తే అవి రూ. 50 నోట్లు. అయినా సరే ఉచితంగా వచ్చినవే కదా అనుకొని జేబులో వేసుకున్నారు.

Currency Notes on Road : రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్లు..దగ్గరకెళ్లి చూస్తే షాక్

అప్పటికే బ్రిడ్జిపై వాహనాల రద్దీ ఉండటంతో రూ. 50 నోట్లను దక్కించుకొనేందుకు వాహనదారులు వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కార్యాలయాలకు, పనుల నిమిత్తం వెళ్లే వారంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘనట స్థలికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. అయితే ట్రాఫిక్ పోలీసులు తెలిపిన అసలు విషయంతో రోడ్లపై పడిన నోట్లను జేబులు వేసుకున్నవారు అవాక్కయ్యారు. రోడ్డుపై పడిన రూ. 50 నోట్లు నకిలీవని, అవి చెల్లవని పోలీసులు తెలిపారు. దీంతో ఊసూరుమంటూ నోట్లు జేబుల్లో వేసుకున్నవారు తిరిగి వాటిని అక్కడే పడేసి వెళ్లిపోయారు.