అమెరికా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 06:04 AM IST
అమెరికా ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్

kamala harris has made history : భారత సంతతి కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్ కు ఈ పదవి దక్కడం ఇదే తొలిసారి కావడంతో ఆమె చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు. ఉపాధ్యక్షురాలిగా ఆమె గెలవాలని భారతీయులు ఎదురు చూశారు. వారి చూపులు ఇప్పుడు ఫలించాయి.



ఈమె ఇంతకుముందే..ఎన్నో ఘనతలు సాధించారు. శాన్ ప్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా సేవలందించారు.



ఇక జీవిత విషయాలకు వస్తే..
1964 అక్టోబర్ 20వ తేదీన ఒక్లాండ్ లో జన్మించారు.
తమిళనాడులోని సంప్రదాయ కుటుంబంలో ఆమె జన్మించారు. తండ్రి జమైకా దేశస్తుడు.
వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం.
యూసీ హేస్టింగ్స్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు.
అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటర్నీ కార్యాలయంలో 8 సంవత్సరాలు పని చేశారు. చిన్నారులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను ఆమె విచారించారు.
డెమొక్రటిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్ గా ఎన్నికయ్యారు.