China : 22 అంతస్తుల భవనంపై చిన్నారులు..ఒళ్లు జలదరించే వీడియో

నెటిజన్లు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలను అజాగ్రత్తగా వదిలేయవద్దని...వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు. 

China : 22 అంతస్తుల భవనంపై చిన్నారులు..ఒళ్లు జలదరించే వీడియో

22 Storey Building In China

Kids Jump On Roof Of 22-Storey Building : ఇద్దరు చిన్నారులు 22 అంతస్తుల భవనంపై ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. హుబీ ప్రాంతంలో జియానింగ్ లో 22 అంతస్తుల భవనం ఉంది. ఇద్దరు చిన్నారులు పై అంతస్తు…పైకి చేరుకున్నారు. అక్కడ ఓ చిన్నారి…మరో భవనంపై ఉన్నాడు. ఇంకో చిన్నారి..ఇవతల ఉన్న భవనంపై కూర్చొన్నాడు. పిల్లలిద్దరూ ఓ మాత్రం భయం లేకుండా ఉండడం వీడియోలో కనిపిస్తోంది.

Read More : Visakha : నాగుల చవితి వేడుకల్లో అపశ్రుతి.. ఒకరు మృతి

ఓ కప్పుపై నుంచి మరో పై కప్పుపైకి దూకుతుంటాడు. ఏ మాత్రం భయం లేకుండా… దుంకుతుండడం చూస్తే..ఒళ్లు జలదించరించకమానదు. వారు మాత్రం క్షేమంగా ఉంటారు. ఏ మాత్రం కాలు జారినా…22వ అంతస్తు నుంచి కిందకు పడే అవకాశం ఉంది. ఓ చిన్నారి భవనంపై నుంచి కిందకు చూస్తూ…సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Read More : OnePlus Nord 2 5G: మళ్లీ పేలిన వన్ ప్లస్ నార్డ్ 2, ప్యాంటు జేబులో పేలడంతో..

ఈ వీడియోను సమీపంలో ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. Sputnik పేరిట ఈ వీడియో యూ ట్యూబ్ లో ప్రత్యక్షమైంది. దీనిని చూసిన నెటిజన్లు తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలను అజాగ్రత్తగా వదిలేయవద్దని…వారిపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.