లండన్‌లో ‘కాఫీ కాలింగ్’..! దటీజ్ కరోనా ఛేంజెస్

  • Published By: nagamani ,Published On : June 5, 2020 / 10:44 AM IST
లండన్‌లో ‘కాఫీ కాలింగ్’..! దటీజ్ కరోనా ఛేంజెస్

కరోనా ప్రపంచ ప్రజల జీవనశైలినే మార్చేసింది. పెను మార్పులు తీసుకొచ్చింది. ఎన్నో మార్పులు..మరెన్నో అలవాట్లకు నాంది పలికింది. హోటల్స్..గెస్ట్ హౌస్ లు ఇలా ఎన్నో క్వారంటైన సెంటర్లుగా మారిపోయాయి. కరోనాకు ముందు కరోనా తరువాత అన్నట్లుగా ఉంది నేటి పరిస్థితి.

లంటన్ లో అటువంటి మార్పులు ఇంచుమించు ప్రతీ వీధుల్లోను కనిపిస్తున్నాయి. లండన్‌లో ప్రసిద్ధి చెందిన ఎరుపు రంగు టెలిఫోన్‌ బాక్సులు లాక్‌డౌన్‌ తరువాత కాఫీషాపులుగా మారిపోయాయి. కొత్త లుక్ తో చూడముచ్చటగొలుపుతున్నాయి. 

లాక్‌డౌన్‌ కారణంగా టెలిఫోన్‌ బూత్‌ మూతబడ్డాయి. సరికొత్త రూపుతో కాఫీ షాపులుగా మారిపోయాయి. రూపులను మార్చి కొత్త వ్యాపారాలను మొదలు పెట్టారు. దీంట్లో భాగంగానే లంటన్ లోని లోరినిస్ కొలంబియాకు చెందిన  హెర్నాండెజ్, సీన్ రాఫెర్టీ దంపతులు తమ టెలీఫోన్ బూత్ ను కాఫీ షాపుగా మార్చేశారు.  

లాక్‌డౌన్‌లో టెలిఫోన్‌ బూత్‌ మూతబడటంతో వారి ఆదాయం ఆగిపోయింది. దీంతో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు. ఆ కాఫీ షాపుకు ‘అమర్‌ కేఫ్‌’ అని పేరు పెట్టారు. ఈ కాఫీ కేఫ్‌లో స్పెషల్‌ కాఫీ వెరీ వెరీ స్పెషల్ గా ఉంటుందని హెర్నాండేజ్‌ చెబుతున్నాడు. 

టెలీఫోన్ బూత్ కు మార్పులు చేశారు. దాన్ని కాఫీకేఫ్‌గా మార్చేశారు. అంతేకాదు ఈ బాక్సును ఎక్కడికైనా తరలించుకోవటానికి వీలుగా మార్చారు. జనాలు ఎక్కడ ఉంటే అక్కడకు దాన్ని తరలించుకోవచ్చన్నమాట.కొన్ని వారాలకు సరిపడా సరుకును కేఫ్‌ లోనే పెట్టేసుకోవచ్చు. అలా కాలానుగుణంగా మారిపోతూ జీవించటమే మనిషి పని. వేరే దారి లేదు. 

చూశారా కరోనా మజాకానా..మార్పులు మంచివా చెడ్డవా అని కాదు ఏం వచ్చినా దాన్ని అధిగమిస్తూ..అనుకరిస్తూ మనిషి జీవితం సాగిపోతుండాలి అని కరోనా నేర్పే పాఠం అని కూడా గుర్తించాలి. 

Read: అమెరికాలో మరో దారుణం…వృద్ధుడిపై పోలీసుల క్రూరత్వం