గోవిందా గోవిందా: ‘మార్స్‌’పైకి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు

  • Published By: veegamteam ,Published On : October 2, 2019 / 04:45 AM IST
గోవిందా గోవిందా: ‘మార్స్‌’పైకి తిరుమల శ్రీ వేంకటేశ్వరుడు

బ్రహ్మాండనాయకుడు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు నామం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మరో గ్రహం పై కూడా శ్రీవారు పేరు చేరనుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు అంటే ఆయన లేని చోటు లేదు. ఆయన విశ్వవ్యాప్తంగా పేరు పొందినవాడు. 

కలియుగ దైవంగా తిరుమల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడి పేరు ఇప్పు మార్క్ పైకి  చేరనుంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తలపెట్టిన మార్స్‌ ప్రయోగానికి సంబంధించిన రోవర్‌లో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సూచించిన పేర్లను ఓ మైక్రోచి్‌పలో నిక్షిప్తం చేసి అంగారకుడిపైకి పంపనుంది. దీనికి ‘సెండ్‌ యువర్‌ నేమ్‌ టు మార్స్‌’ పేరిట సెప్టెంబరు 30 వరకు నాసా పేర్లను ఆహ్వానించింది. 

దీంతో కోటి మందికిపైగా ప్రజలు పలు పేర్లను పంపించారు. వాటిలో శ్రీ తిరుమల శ్రీవేంకటేశ్వరుని పేరు ఉండడం విశేషం. నేషనల్‌ మిషన్‌ ఆఫ్‌ మాన్యుస్ర్కిప్ట్‌ మాజీ డైరెక్టర్‌ వి.వెంకటరమణారెడ్డి నాసా వెబ్‌సైట్‌లో శ్రీవారి పేరును ప్రతిపాదించారు. నాసా మార్స్‌ మిషన్‌ ప్రయోగం 2020 జూలైలో జరగనుంది. ఈ వ్యోమనౌక ఫిబ్రవరి 2021 లో అంగారక గ్రహంపైకి చేరుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోవర్‌పై అతికించిన మైక్రోచిప్‌లపై స్టెన్సిల్ చేసిన 10 మిలియన్ల పేర్లలో లార్డ్ పేరు ఉంటుందని అమెరికన్ అంతరిక్ష సంస్థ తెలిపింది.