Ukraine War : తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్.. రష్యా సైనికులు ఎంతమంది హతమయ్యారంటే?

ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బాంబులు, క్షిపణుల దాడులతో రష్యాసైన్యం విరుచుకు పడుతుంది. ఉక్రెయిన్ లోని బుచా, మేరియుపోల్ వంటి నగరాలు...

Ukraine War : తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్.. రష్యా సైనికులు ఎంతమంది హతమయ్యారంటే?

Ukraine War

Ukraine War : ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బాంబులు, క్షిపణుల దాడులతో రష్యాసైన్యం విరుచుకు పడుతుంది. ఉక్రెయిన్ లోని బుచా, మేరియుపోల్ వంటి నగరాలు ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల యుద్ధంలో మరణాల సంఖ్య అధికంగానే ఉంటుంది. ఉక్రెయిన్ ప్రజలు, ఇరు దేశాల సైనికులు మృతిచెందుతున్నారు. ఉక్రెయిన్ ప్రధాని జలెన్స్ స్కీ మాత్రం రష్యాదాడులను ఎదుర్కొని తీరుతామని, తమ ప్రాణమున్నంత వరకు పోరాడతామని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రష్యా సైన్యం మేరియుపోల్ లో విధ్వంసం సృష్టిస్తుంది. బుచాను మించి ఇక్కడ బాంబుల దాడి కొనసాగుతుంది.

Russia ukraine war : యుక్రెయిన్‌పై యుద్ధం గురించి రష్యా వ్యాపారవేత్త ఘాటు వ్యాఖ్యలు

ఉక్రెయిన్ కు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ సైన్యానికి కావాల్సిన ఆయుదాలను సమకూర్చుతూ రష్యా సైనికుల దాడిని తిప్పికొ్ట్టేందుకు సహకరిస్తున్నాయి. ఉక్రెయిన్ – రష్యాల మధ్య వార్ మొదలై 50రోజులు దాటింది. ఈ వార్ లో ఉక్రెయిన్ సైన్యం ఇప్పటి వరకు 21,200 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా ట్విటర్ వేదికగా తెలిపింది.

రష్యన్ సైన్యాన్నే కాక 176 యుద్ధ విమానాలు, 153 హెలికాప్టర్లు, 838 యుద్ధ ట్యాంకులు, 2,162 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. వీటితో పాటు 397 ఆర్టిలరీ సిస్టమ్‌లు, 138 ఎమ్‌ఎల్‌ఆర్‌ వాహనాలు, 76 ఇంధన ట్యాంకులు సహా భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తాజాగా ట్విటర్ లో తెలిపింది.