Russia ukraine war : యుక్రెయిన్‌పై యుద్ధం గురించి రష్యా వ్యాపారవేత్త ఘాటు వ్యాఖ్యలు

యుక్రెయిన్‌పై యుద్ధం గురించి రష్యా వ్యాపారవేత్త ఒలెగ్‌ టింకావ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Russia ukraine war : యుక్రెయిన్‌పై యుద్ధం గురించి రష్యా వ్యాపారవేత్త ఘాటు వ్యాఖ్యలు

Russian Tycoon Tinkov Denounces Crazy War In Ukraine

Russia ukraine war : రష్యాకు చెందిన వ్యాపారవేత్త యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం గురించి అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రష్యా సంపన్న వ్యాపారవేత్త ఒలెగ్‌ టింకావ్‌ మాట్లాడుతూ..‘యుక్రెయిన్ పై చేస్తున్న్ ఈ పిచ్చి (వెర్రి) యుద్ధాన్ని వెంటనే ఆపాయాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆర్మీ ఓ చెత్త అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రష్యాలో 90 శాతం మంది యుద్ధాన్ని సమర్థించడం లేదని ఈ విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమాయ సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని..ఇప్పటికైనా యుద్ధాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన రష్యన్లలో టింకావ్‌ కూడా ఉన్నారు.

కానీ ఎవరు ఎన్నిరకాలుగా వ్యాఖ్యానించినా..ఎన్ని విమర్శలు చేసినా..ఎన్ని దేశాలు వ్యతిరేకించినా యుక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపేదేలేదంటున్నారు పుతిన్. తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శత్రుదేశాలకు వార్నింగ్‌ ఇచ్చారు. సర్మాత్‌ ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం (ఏప్రిల్ 20,2022)పుతిన్ ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని ధీమా వ్యక్తంచేస్తు ఇక ఏదేశమైనా సరే మమ్మల్ని బెదిరించవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్‌ క్షిపణులకు సర్మాత్‌ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్‌ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. సర్మాత్‌ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్‌ అభినందించారు.