Kidney Beans : గిదేం పిచ్చి, ఆ భాగంలో బీన్స్ ఇరికించుకున్నాడు…ఆసుపత్రికి పరుగు

ప్రైవేటు పార్టులో బీన్స్ ఇరికించుకున్నాడు. తీరా..అవి బయటకు రాకపోయేసరికి నరకయాతన పడ్డాడు. తనను రక్షించాలంటూ ఆసుపత్రికి పరుగులు తీశాడు.

Kidney Beans : గిదేం పిచ్చి, ఆ భాగంలో బీన్స్ ఇరికించుకున్నాడు…ఆసుపత్రికి పరుగు

Kidney Beens

Updated On : August 21, 2021 / 1:32 PM IST

Kidney Beans : లైంగిక ఆనందం కోసం ఓ వ్యక్తి పిచ్చి పని చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ప్రైవేటు పార్టులో బీన్స్ ఇరికించుకున్నాడు. తీరా..అవి బయటకు రాకపోయేసరికి నరకయాతన పడ్డాడు. తనను రక్షించాలంటూ ఆసుపత్రికి పరుగులు తీశాడు. అతను చేసిన పనికి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. గిదేం పని అని…ఆపరేషన్ చేసి అతడిని రక్షించారు. ఈ ఘటన Michiganలో చోటు చేసుకుంది.

మిచిగాన్ లో 30 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లైంగికంగా తృప్తి పొందేందుకు…స్ఖలనం సమయంలో మూత్రనాళంలోకి ఆరు బీన్స్ ను ఇరికించుకున్నాడు. అవి కాస్తా..అందులో ఇరుక్కపోయాయి. వాటిని తొలగించాలని అనుకుని విఫలం చెందాడు. ఓ పరికరంతో ఉపయోగించి బీన్స్ ను బయటకు తీయాలని ప్రయత్నించినా…సఫలం కాలేకపోయాడు. చివరకు ఆసుపత్రికి పరుగులు తీశాడు. మూత్ర విసర్జన సమయంలో తాను ఇబ్బందులు పడుతున్నట్లు డాక్టర్లకు తెలిపాడు.

CT Scan తీయగా అసలు విషయం బయటపడింది. అందులో ఆరు బీన్స్ ఉన్నట్లు కనిపించింది. అవి ప్రతొక్కటి 15 మిల్లిమీటర్లు, 7 మిల్లీమీటర్లుగా ఉన్నాయి. ఈ విషయాన్ని journal Urology Case లో పొందుపరిచారు. అప్పుడు అసలు విషయం చెప్పాడు. దీంతో బీన్స్ ను బయటకు తీయడానికి యూరాలజిస్టులు ప్రయత్నించారు. ఓ క్రీమ్ ఉపయోగించి ఓ బీన్స్ ను బయటకు తీశారు. మిగిలిన వాటిని తీయడానికి శ్రమించాల్సి వచ్చింది. మరుసటి రోజు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. మూత్రనాళాన్ని తెరిచి…ఓ గొట్టాన్ని అందులోకి పంపి…బీన్స్ తీశారు. అదే రోజున ఆ వ్యక్తిని డిశ్చార్జ్ చేశారు.