Steals Ambulance: హాస్పిటల్‌కు వెళ్లేందుకు అంబులెన్స్ దొంగతనం

అసలే కరోనా సీజన్.. హాస్పిటల్ కు వెళ్లేందుకు వాహనాలే లేకుండా పోయాయి. అటువంటి సమయంలో హాస్పిటల్ కు వెళ్లాలని నేరుగా అంబులెన్సునే చోరీ చేసేశాడు. దొంగను ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులకు తాను హార్ట్ పేషెంట్ అని..

Steals Ambulance: హాస్పిటల్‌కు వెళ్లేందుకు అంబులెన్స్ దొంగతనం

Ambualnce Steals

Steals Ambulance: అసలే కరోనా సీజన్.. హాస్పిటల్ కు వెళ్లేందుకు వాహనాలే లేకుండా పోయాయి. అటువంటి సమయంలో హాస్పిటల్ కు వెళ్లాలని నేరుగా అంబులెన్సునే చోరీ చేసేశాడు. దొంగను ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులకు తాను హార్ట్ పేషెంట్ ను అని హాస్పిటల్ కు వెళ్లేందుకే ఈ పనిచేసినట్లు తెలిపాడు.

బాల్టిమోర్ సిటీ ఫైర్ డిపార్ట్మెంట్ మెడికల్ యూనిట్ కు సీగల్ ఎవెన్యూ నుంచి కాల్ వచ్చింది. రిక్వెస్ట్ ప్రకారం.. నేరుగా స్పాట్ కు చేరుకన్నారు మెడికల్ సిబ్బంది. లొకేషన్ లోపలికి ఎంటర్ అయ్యేందుకు అంబులెన్స్ దిగి ఒక ఇంట్లోకి వెళ్లారు. ఈ లోపే 38ఏళ్ల వ్యక్తి ఎవరూ లేని వాహనంలో చొరబడి స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు.

అతను అలా ప్రయాణిస్తుండగా కాస్త దూరం వెళ్లాక.. మెడ్‌స్టర్ హార్బర్ హాస్పిటల్ వద్ద పోలీసుల అధికారులు ఆపేశారు. డ్రైవర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. వారికి తాను హార్ట్ పేషెంట్ ను అని.. హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్ ను కలిసేందుకే అంబులెన్స్ దొంగిలించినట్లు చెప్పాడు.

వెంటనే అతణ్ని హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అంబులెన్సును డ్రైవింగ్ చేస్తూ వచ్చిన వ్యక్తి.. పోలీస్ వెహికల్ తో పాటు.. కొన్ని చెట్లను గుద్దుకుంటూ వెళ్లాడు. వాహనానికి జీపీఎస్ సర్వీస్ ఉండటంతో వెంటనే పట్టుకోగలిగినట్లు పోలీసులు చెబుతున్నారు.