Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన

యుక్రెయిన్ లో రష్యా సైన్యం బీకర దాడులు చేస్తుంది. మూడు నెలలుగా విరామం లేకుండా రష్యా సైనికులు యుక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరుగుతుంది. యుక్రెయిన్ పై రష్యా దాడులను ఖండిస్తూ...

Ukraine Crisis: రష్యా చేతుల్లోకి మరియపోల్.. యుద్ధం ముగిసిందని ప్రకటించిన పుతిన్ సేన

Russia

Ukraine Crisis: యుక్రెయిన్ లో రష్యా సైన్యం బీకర దాడులు చేస్తుంది. మూడు నెలలుగా విరామం లేకుండా రష్యా సైనికులు యుక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరుగుతుంది. యుక్రెయిన్ పై రష్యా దాడులను ఖండిస్తూ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీల్యాండ్ తోపాటు అనేక దేశాలు పుతిన్ తీరుపై మండిపడుతున్నాయి. దీనికితోడు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యాను ఒంటరిని చేయడానికి అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ యుక్రెయిన్ పై దాడులను విరమించేందుకు పుతిన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

Russia president: ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలు నాటోలో చేరికపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా యుక్రెయిన్ లోని మరియపోల్ విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. మరియపోల్ ను స్వాధీనం చేసుకొనేందుకు కొన్ని నెలల పాటు సాగిన యుద్ధం ముగిసిందని రష్యా సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగ‌ర్ కొన‌షెంకోవ్ వెల్లడించారు. మరియపోల్ లో అజోవ్ స్టీల్ ప్లాంట్ కూడా విముక్తి అయినట్లు ఆయన వెల్లడించారు. అజోవ్ ప్లాంట్ కు రక్షణగా ఉన్న యుక్రెయిన్ సైనికులు పూర్తిగా లొంగిపోయినట్లు రష్యా రక్షణ శాఖ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ప్లాంట్ లో పూర్తి ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తెచ్చినట్లు రష్యా దళాలు తెలిపాయి. అజోవ్ స్టీల్ ప్లాంట్ ఆక్రమణతో శుక్రవారం 531 మంది ఉన్న యుక్రెయిన్ సైనికుల చివరి గ్రూపు లొంగిపోయినట్లు రష్యా ప్రకటించింది.

Russia Serious Warning : చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, తీవ్ర పరిణామాలు తప్పవు- ఆ దేశాలకు రష్యా వార్నింగ్

అంతకుముందు 2400 మంది యుక్రెయిన్ పౌరులు, సైనికులను రష్యా సైన్యం తమ అదుపులోకి తీసుకుంది. అయితే రష్యా బలగాల దాడుల నేపథ్యంలో యుక్రెయిన్ లోనే భారీ పరిశ్రమ అయిన అజోవ్ ప్లాంట్ లో కొన్ని నెలల పాటు యుక్రెయిన్ సైన్యం తలదాచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు యుక్రెయిన్ పై దాడులతో విరుచుకుపడుతున్న రష్యాపై పలు దేశాల ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. రష్యాకు చెందిన ప్రముఖులపై తాజాగా కెనడా బ్యాన్ విధించింది.