Russia president: ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలు నాటోలో చేరికపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో చేరేందుకు ఫిన్లాండ్, స్వీడన్ లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే యుక్రెయిన్ నాటోలో చేరేందుకు సముఖత చూపుతుందనే ఉద్దేశంతో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆ దేశంపై ...

Russia president: ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాలు నాటోలో చేరికపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు

Nato

Russia president: అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో చేరేందుకు ఫిన్లాండ్, స్వీడన్ లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే యుక్రెయిన్ నాటోలో చేరేందుకు సముఖత చూపుతుందనే ఉద్దేశంతో రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఆ దేశంపై యుద్ధం కొనసాగిస్తున్నారు. ఆ దేశాన్ని ఆక్రమించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రష్యాకు సరిహద్దు దేశాలైన ఫిన్లాండ్, స్వీడన్ లు సైతం ఇప్పుడు అమెరికా నేతృత్వంలోని నాటోలో చేరేందుకు సిద్ధమవుతున్నాయి.

Russia Serious Warning : చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, తీవ్ర పరిణామాలు తప్పవు- ఆ దేశాలకు రష్యా వార్నింగ్

రష్యాతో 1,300 కిలోమీటర్లకుపైగా సరిహద్దును ఫిన్లాండ్‌ పంచుకుంటుంది. అయితే ఫిన్లాండ్, స్వీడన్లు సైనిక పరంగా కొన్ని దశాబ్దాలుగా తటస్థంగా ఉంటూవస్తున్నాయి. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధ పరిణామాలతో నాటో వైపు చూపుతున్నాయి. నాటోలో ఈ దేశాలు చేరితే రాష్యాకు ముప్పు జరిగే ప్రమాదం ఉందన్న వాదన ఉంది. అయితే తాజాగా ఈ అంశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు అమెరికా నేతృత్వంలోని సైనిక కూటమి నాటోలో చేరితే తమకెలాంటి సమస్యలు లేవని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.

Ukraine vs russia war: నేను బతకడం దాదాపు అసాధ్యం.. ఎలాన్ మస్క్‌కు నా ట్వీట్‌ను చేరవేయండి..

అయితే వీటి చేరిక రష్యాకు తక్షణ ముప్పు కలిగించదన్నారు. నాటోలో చేరేందుకు ముందుకొచ్చిన దేశాల్లో సైనిక సదుపాయాలను పెంపొందిస్తే తమ స్పందన చవిచూస్తాయని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. మాకొచ్చే బెదిరింపులకు తగ్గట్లే మా స్పందన ఉంటుందని, అకారణంగా సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. వాటికి అనుగుణంగానే మేం ముందుకు వెళ్తామంటూ పుతిన్ పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.