Ukraine vs russia war: నేను బతకడం దాదాపు అసాధ్యం.. ఎలాన్ మస్క్‌కు నా ట్వీట్‌ను చేరవేయండి..

యుక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులను కొనసాగిస్తూనే ఉంది. బాంబుల మోతతో యుక్రెయిన్ వాసులు కంటిమీద కనుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజీల్యాండ్‌తో ...

Ukraine vs russia war: నేను బతకడం దాదాపు అసాధ్యం.. ఎలాన్ మస్క్‌కు నా ట్వీట్‌ను చేరవేయండి..

Elon Musk (1)

Ukraine vs russia war: యుక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులను కొనసాగిస్తూనే ఉంది. బాంబుల మోతతో యుక్రెయిన్ వాసులు కంటిమీద కనుకు లేకుండా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజీల్యాండ్‌తో పాటు ప్రపంచంలోని అధిక దేశాలు రష్యా తీరును ఖండిస్తున్నాయి. రాష్యా సైన్యం దాడులను తిప్పికొట్టేందుకు ఆయుధాలు సరఫరా చేస్తూనే.. మరో వైపు రష్యాతో వ్యాపార లావాదేవీలు, వస్తు రవాణాపై ఆంక్షలు విధిస్తున్నాయి. అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం యుక్రెయిన్‌ను హస్తగతం చేసుకొనే వరకు వెనక్కు తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Russia vs ukraine war: యుక్రెయిన్‌లో రష్యా సైన్యం దాడులు ఎందుకు.. ఎప్పటి వరకు చేస్తుందో స్పష్టం చేసిన పుతిన్

మూడు నెలుగా రష్యా దాడులు చేస్తుంది. ఈ క్రమంలో నౌకా శ్రయాన్ని నాశనం చేసింది. యుక్రెయిన్లు మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ వద్ద రష్యా సైన్యం నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో 36వ సెపరేట్ మెరైన్ బ్రిగేడ్ కమాండర్ అయిన సెర్హి వోలినా టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్‌కు ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ప్రత్యేకంగా ట్వీటర్ ఖాతాను తెరిచి ఎలాన్ మస్క్‌కు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ లో ఆమె మస్క్‌కు విజ్ఞప్తి చేసింది. దక్షిణ నగరంపై నియంత్రణలో ఉన్న రష్యన్ దళాలచే చిక్కుకున్న వారి తరపున జోక్యం చేసుకోవాలని, రష్యాతో మాట్లాడి మమ్మల్ని రక్షించాలని ఆ ట్వీట్ లో సెర్హి వోలినా కోరింది.

Russia vs ukraine war: పుతిన్ భయంకరమైన తప్పు చేస్తున్నాడు.. గుణపాఠం తప్పదు..

అసాధ్యమైన వాటిని సాధ్యం చేసి వాటిని నమ్మమని ప్రజలకు నేర్పడానికి మీరు మరొక గ్రహం నుంచి వచ్చారని ప్రజలు అనుకుంటున్నారని ఈ సందర్భంగా వోలినా.. మస్క్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసింది. నేను జీవించడం దాదాపు అసాధ్యమే. అజోవ్‌స్టల్‌లో రష్యా దళాలనుంచి రక్షణ పొందడానికి మాకు సహాయం చేయండి అంటూ ట్వీట్ లో వోలినా పేర్కొంది. అంతేకాక నేను చేసిన ట్వీట్ ఎలాన్ మస్క్ కు చేరేలా భూమి మీద ఉన్న ప్రతిఒక్కరూ ప్రయత్నం చేయాలని ఆమె తన ట్వీట్ లో పేర్కొంది.