Bangladesh: బంగ్లా బట్టల బజార్‭లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 3,000 దుకాణాలు

అగ్నిమాపక సేవ అధికారి రషీద్ బిన్ ఖలీద్ మాట్లాడుతూ 50 అగ్నిమాపక యూనిట్లు మంటలను ఆర్పడానికి పని చేస్తున్నాయని, అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంక తెలియలేదని అన్నారు. ‘‘చాలా దుకాణాలు మంటల్లో బూడిదయ్యాయి. అయితే లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. చాలా దుకాణాలు తెరవకముందే తెల్లవారుజామున మంటలు చెలరేగాయి’’ అని ఖలీద్ చెప్పారు.

Bangladesh: బంగ్లా బట్టల బజార్‭లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో 3,000 దుకాణాలు

fire breaks at bangamarket in bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న బట్టల బజారులో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అందులో ఉన్న సుమారు 3,000 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నాయి. భారీ మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది, ఆర్మీ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలోనే క్లాత్ మార్కెట్‌లకు నిలయం బంగాబజార్. ఇరుకైన దుకాణాలు, పెద్ద ఎత్తున జనాలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇందులోనే తెల్లవారుజామున రగులుకున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని బంగ్లా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

ఈ విషయమై అగ్నిమాపక సేవ అధికారి రషీద్ బిన్ ఖలీద్ మాట్లాడుతూ 50 అగ్నిమాపక యూనిట్లు మంటలను ఆర్పడానికి పని చేస్తున్నాయని, అయితే మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంక తెలియలేదని అన్నారు. ‘‘చాలా దుకాణాలు మంటల్లో బూడిదయ్యాయి. అయితే లోపల ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. చాలా దుకాణాలు తెరవకముందే తెల్లవారుజామున మంటలు చెలరేగాయి’’ అని ఖలీద్ చెప్పారు.