McDonald : 4 గంటల్లో 6 వేల 400 మెక్ డెనాల్డ్ వస్తువుల ఆర్డర్ ప్యాకింగ్

ఓ మెక్ డోనాల్డ్ వర్కర్ కేవలం నాలుగు గంటల్లో 6 వేల 400 ఫుడ్ వస్తువుల ఆర్డర్ ను ప్యాకింగ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

McDonald : 4 గంటల్లో 6 వేల 400 మెక్ డెనాల్డ్ వస్తువుల ఆర్డర్ ప్యాకింగ్

Mc Donald

McDonald’s Employee : ఓ మెక్ డోనాల్డ్ వర్కర్ కేవలం నాలుగు గంటల్లో 6 వేల 400 ఫుడ్ వస్తువుల ఆర్డర్ ను ప్యాకింగ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. జార్జియాలోని పెర్రీలో మెక్ డోనాల్డ్ ఫుడ్ స్టాల్ ఉంది. ఓ కస్టమర్ కాల్ చేసి ఆర్డర్ చెప్పారు. తమకు వేయి 600 చికెన్ శాండ్ విచ్ లు, 1600 మెక్ డబుల్స్, 3 వేల 200 చాక్లెట్స్ కుకీస్ లు కావాలని ఆర్డర్ చేయడంతో అక్కడ పని చేస్తున్న మహిళా ఉద్యోగి కర్టిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే ఆర్డర్ తీసుకున్న అనంతరం ఫుడ్ తయారు చేస్తున్న వారికి ఆర్డర్ చెప్పింది. అన్నీ ఫుడ్ ఐటమ్స్ సిద్ధం అయిపోయిన తర్వాత..కర్టిస్ ప్యాకింగ్ చేయడానికి సిద్ధమయ్యారు.

Read More : Replacement : న్యూఢిల్లీ వీఎంఎంసీ హాస్పటల్ లో 229పోస్టుల భర్తీ

ప్యాకింగ్ చేసిన ఫుడ్ వస్తువులను వీడియోలో చూపించారు. అట్టపెట్టెల్లో వాటిని భద్రపరిచారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా..నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పలువురు కామెంట్స్ చేశారు. ఎక్కడా లెక్క తప్పకుండా ఎలా ప్యాకింగ్ చేశారని ప్రశ్నించారు. తన ముందు ఇద్దరు సిబ్బంది ఉన్నారని, క్యాలిక్యేటర్ ను ఉపయోగించి..ఒకేసారి 20 శాండ్ విచ్ లను ప్యాకింగ్ చేయడం జరిగిందని కర్టిస్ తెలిపారు. కానీ..వేడి కోల్పోకుండా..శాండ్ విచ్ లను ఎలా భద్రపరిచారని ప్రశ్నించారు.

Read More : Karthika Masam : భక్తులతో కిక్కిరిసిన దేవాలయాలు

వీలైనంత ఉష్ణోగ్రత మధ్య ఉంచిన అనంతరం ప్యాకింగ్ చేశామన్నారు. అయితే..ఇంత భారీ ఆర్డర్ ఎందుకు చేశారో అర్థం కావడం లేదని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 1200 మంది పిల్లలకు భోజనం ఆర్డర్ చేశారని అనుకున్నట్లు కామెంట్ చేశారు. స్థానికంగా ఉన్న జైలు నుంచి ఆర్డర్ వచ్చిందని అనుకుంటున్నట్లు, ఆహారం  ఖైదీలకు ఇచ్చారా ? అక్కడున్న సిబ్బందికి అనే విషయాన్ని కర్టిస్ ప్రస్తావించలేదు. మొత్తానికి దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.