MERCEDES-BENZ : ఒక్కసారి చార్జ్ చేస్తే వెయ్యి కిమీ ప్రయాణం.. మెర్సిడెస్ బెంజ్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కారు

ఇప్పటివరకు చాలా కంపెనీలు 500కిమీ లోపు రేంజ్ గల ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొనివచ్చేవి. అయితే, మెర్సిడెస్ బెంజ్ మాత్రం అంతకు మించి రేంజ్ తో వస్తోంది. మెర్సిడెస్ బెంజ్ తన..

MERCEDES-BENZ : ఒక్కసారి చార్జ్ చేస్తే వెయ్యి కిమీ ప్రయాణం.. మెర్సిడెస్ బెంజ్ నుంచి మైండ్ బ్లోయింగ్ ఎలక్ట్రిక్ కారు

Mercedes Benz

MERCEDES-BENZ : ఇప్పుడంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఫోకస్ పెట్టాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీల మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొచ్చాయి. తాజాగా జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ సైతం రంగంలోకి దిగింది. మెర్సిడెస్ బెంజ్ సూపర్ ఎలక్ట్రిక్ కారు తీసుకురానుంది.

Corona New Variant IHU : కరోనా కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ కంటే డేంజర్…?

ఇప్పటివరకు చాలా కంపెనీలు 500కిమీ లోపు రేంజ్ గల ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకొనివచ్చేవి. అయితే, మెర్సిడెస్ బెంజ్ మాత్రం అంతకు మించి రేంజ్ తో వస్తోంది. మెర్సిడెస్ బెంజ్ తన సరికొత్త ఎలక్ట్రిక్ కారు(విజన్ EQXX మోడల్ ప్రోటోటైప్) వివరాలు వెల్లడించింది.

* విజన్ EQXX మోడల్ ప్రోటోటైప్
* దీనిని ఫార్ములా F1 బృందం నిపుణులతో డిజైన్ చేయించింది.
* ఈ విజన్ EQXX కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు అభివృద్ధి చేసిన అత్యంత సమర్థవంతమైన మెర్సిడెస్ కారుగా నిలిచినట్లు సంస్థ తెలిపింది.
* ఈ కారును ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఆగకుండా 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
* ఈ కారు అల్ట్రా సన్నని సోలార్ ప్యానెల్స్ తో కూడా వస్తుంది.

Offline Payments : ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్… ఆఫ్‌లైన్ పేమెంట్లపై రూ. 200 లిమిట్..!

* యూకేలోని మెర్సిడెస్-ఎఎంజి హై పెర్ఫార్మెన్స్ పవర్ ట్రైన్స్ విభాగానికి చెందిన ఎఫ్ 1 నిపుణుల సహాయంతో అభివృద్ధి చేసిన కొత్త కెమిస్ట్రీని బ్యాటరీ కలిగి ఉందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది.
* సాధారణ బ్యాటరీ కంటే 30శాతం తక్కువ బరువుంటే సరికొత్త బ్యాటరీ
* ఈవీ కార్లలో ఎరోడైనమిక్స్‌ ఫీచర్‌తో, అత్యధిక వేగంగా వెళ్లే కారుగా ఇది నిలవనుందట.
* 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది మెర్సిడెస్.